గోవా గవర్నర్‌కు సీనియర్ జర్నలిస్టుల ఫెడరేషన్ వినతి!

గోవా గవర్నర్‌కు సీనియర్ జర్నలిస్టుల ఫెడరేషన్ వినతి:

సామాజిక భద్రత,సంక్షేమం కల్పించాలని విజ్ఞప్తి 

జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ ఛానల్ న్యూస్...

సింగరేణి ప్రతినిధి, మార్చి 18,జర్నలిస్ట్ తెలుగు దినపత్రిక న్యూస్ :దేశవ్యాప్తంగా ఉన్న సీనియర్ జర్నలిస్టుల సామాజిక భద్రత, సంక్షేమం కోసం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ 'సీనియర్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా' ప్రతినిధి బృందం గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు ని కలిసింది. ఈ నెల 16వ తేదీన రాజ్ భవన్‌లో గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ప్రతినిధులు, జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి, కేంద్ర ప్రభుత్వానికి తగిన సిఫార్సులు చేయాలని కోరుతూ ఒక వినతిపత్రాన్ని అందజేశారు. పదవీ విరమణ పొందిన జర్నలిస్టులు ఎదుర్కొంటున్న దయనీయ పరిస్థితులను ఈ సందర్భంగా ప్రతినిధి బృందం గవర్నర్ దృష్టికి తీసుకెళ్లింది. చాలా మీడియా సంస్థల్లో పెన్షన్ విధానం లేకపోవడం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే అరకొర పెన్షన్లు కేవలం అక్రిడిటేషన్ ఉన్న కొద్దిమందికే (ప్రధానంగా రాజధాని రిపోర్టర్లకు మాత్రమే) పరిమితం కావడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. సరైన ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు లేకపోవడం, గతంలో సీనియర్ సిటిజన్లకు ఉన్న రైల్వే ప్రయాణ రాయితీలను సైతం తొలగించడం వల్ల వృద్ధాప్యంలో సీనియర్ జర్నలిస్టులు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు వినతిపత్రంలో పేర్కొన్నారు.ప్రభుత్వానికి జర్నలిస్టుల ప్రధాన డిమాండ్లు:జాతీయ పెన్షన్ పథకం: దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏకరూపతతో సీనియర్ జర్నలిస్టుల కోసం ఒక 'జాతీయ పెన్షన్ స్కీమ్‌'ను అమలు చేయాలి.కనీస పెన్షన్ రూ.20,000,రిపోర్టర్లు, సబ్-ఎడిటర్లు, ప్రూఫ్ రీడర్లు, ఫోటోగ్రాఫర్లు తదితర అన్ని విభాగాల మీడియా వృత్తి నిపుణులకు నెలకు కనీసం రూ.20,000 కనీస పెన్షన్ మంజూరు చేయాలి.జాతీయ సంక్షేమ నిధి: రిటైర్డ్ జర్నలిస్టుల అత్యవసర వైద్యం, గృహ నిర్మాణం, పిల్లల చదువుల అవసరాల కోసం 'జాతీయ సంక్షేమ నిధి'ని ఏర్పాటు చేయాలి. దీనికోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే డిఏవిపి అడ్వర్టైజ్‌మెంట్ బిల్లుల నుంచి కనీసం 10 శాతం నిధులను ఈ కార్పస్ ఫండ్‌కు కేటాయించాలి.మీడియా కమిషన్ ఏర్పాటు: సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో ఒక 'మీడియా కమిషన్‌'ను ఏర్పాటు చేసి, జర్నలిస్టుల సామాజిక భద్రత, న్యాయపరమైన అంశాలను సమగ్రంగా పరిశీలించి పరిష్కరించాలి. ఇందులో రిటైర్డ్ జర్నలిస్టులు, ఉద్యోగులు, మీడియా యాజమాన్యాలు, ప్రభుత్వ అధికారులకు ప్రాతినిధ్యం కల్పించాలి.పాల్గొన్న ప్రతినిధులు:ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ ఉపాధ్యక్షులు పులిపాక ఆనందం (తెలంగాణ), డాక్టర్ ఎన్. జనార్దన్ (ఏపీ), బెనుధర్ పాండా (ఒడిశా), జాతీయ కార్యదర్శి కె. శాంత కుమారి (కర్ణాటక), ఈసీ మెంబర్లు ఎన్. శ్రీనివాస్ రెడ్డి, పెడద పరమేశ్వర రావు,ఐ ఎఫ్ డబ్ల్యూ జే జాతీయ కౌన్సిల్ సభ్యులు చిర్ర శ్రీనివాస్, ఎన్.సి మెంబర్లు ఎండి రఫీ, ఎన్. సారంగపాణి, మరియు సీనియర్ జర్నలిస్ట్ ఎన్. రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లపై గవర్నర్ సానుకూలంగా స్పందించినట్లు ప్రతినిధులు తెలిపారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

ఆర్కేపిలో ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి-ఫ్లాష్..ఫ్లాష్ న్యూస్...

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ