మందమర్రిలో స్విమ్మింగ్ పూల్ ప్రారంభించిన జిఎం రాధాకృష్ణ
మందమర్రిలో స్విమ్మింగ్ పూల్ ప్రారంభించిన జిఎం రాధాకృష్ణ
-- జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ ఛానల్ న్యూస్...
మందమర్రి న్యూస్,మార్చి-14,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్: సింగరేణి కాలరీస్ లోని మందమర్రి ఏరియాలో గల మందమర్రి సిఈఆర్ క్లబ్ లోని స్విమ్మింగ్ పూల్ ను శనివారం మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్.రాధాకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరై ఎట్టకేలకు రిబ్బన్ కట్ చేసి పున:ప్రారంభించారు.ఆ సందర్భంగా డివిజన్ జిఎం మాట్లాడుతూ..స్విమ్మింగ్ శిక్షణకు వచ్చేవాళ్లు స్విమ్మింగ్ పూల్ యొక్క నియమ, నిబంధనలు తప్పకుండా పాటించాలని గుర్తు చేశారు.స్విమ్మింగ్ కోచ్ యొక్క పర్యవేక్షణలో శిక్షణ తీసుకోవాలని సూచించారు.ఆ కార్యక్రమంలో మందమర్రి ఏరియా ఎస్.ఓ.టు జి.ఎం.జి.ఎల్ ప్రసాద్,మందమర్రి బ్రాంచ్ ఏఐటీయూసీ జాయింట్ సెక్రటరీ కంది శ్రీనివాస్,డివైపిఎం ఆసిఫ్,సివిల్ ఎస్ ఈ శ్రీధర్,సీనియర్ పర్సనల్ ఆఫీసర్ కార్తీక్,ఎస్.ఈ ఎలక్ట్రికల్ నరేష్,సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ రవి,సీనియర్ అధికారులు,గుర్తింపు సంఘం ఏరియా నాయకులు,పి.బానయ్య,ఈ రాజేశ్వరరావు,తదితరులు పాల్గొన్నారు.


Comments
Post a Comment