అప్పుల బాధతో దంపతులు ఆత్మహత్య-ఘోర విషాద ఘటన

అప్పుల భారానికి ప్రాణాలు అర్పించకండి-సమాజానికి హెచ్చరికగా మారిన విషాద ఘటన

జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ ఛానల్ న్యూస్...

మార్చి-5,జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ ఛానల్ న్యూస్: మహబూబ్ నగర్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.ఆ క్రమంలో చూస్తే..అప్పుల బాధ తాళలేక ఒక దంపతులు ఆత్మహత్యకు యత్నించగా ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.జంగమయ్యపల్లి గ్రామానికి చెందిన దంపతులు తమ చిన్న పసిబిడ్డను పొలంలో ఉన్న ఉయ్యాలలో వదిలి,సమీపంలోని చెట్టుకు ఉరివేసుకున్నారు.ఆ ఘటనలో భార్య అక్కడికక్కడే మృతి చెందగా,భర్త తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.చిన్నారి మాత్రం ప్రాణాలతో బయటపడింది.ఆ పొలంలో ఉయ్యాలలో ఒంటరిగా ఉన్న శిశువును గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు.అప్పుల ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక సంబంధిత దంపతులు ఇలాంటి తీవ్ర నిర్ణయం తీసుకున్నారని గ్రామస్థులు చెబుతున్నారు.ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని కలిగించింది.పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.అయితే ఈ విషాద ఘటన సమాజానికి ఒక గాఢమైన సందేశాన్ని ఇస్తోంది.అప్పులు,ఆర్థిక సమస్యలు ఎంత పెద్దవైనా ప్రాణాల కంటే విలువైనవి కావు.సమస్యలు వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు,స్నేహితులు,సమాజం లేదా అధికారులను ఆశ్రయించడం ద్వారా పరిష్కారం కనుగొనవచ్చు.ఒక క్షణిక నిర్ణయం వెనుక ఒక కుటుంబం,ముఖ్యంగా అమాయక పిల్లల భవిష్యత్తు చీకటిలో మిగిలిపోతుంది.ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకూడదనే ఉద్దేశంతో సమస్యలు ఎంత పెద్దవైనా ప్రాణాలు తీసుకోవడం పరిష్కారం కాదని సమాజానికి సంకేతం ఇస్తున్న జర్నలిస్టు డైలీ న్యూస్ పేపర్-టీవీ ఛానల్ న్యూస్ తరపున ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలని,సమస్యలకు మార్గం వెతుక్కోవాలని సూచిస్తున్నాము.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

ఆర్కేపిలో ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి-ఫ్లాష్..ఫ్లాష్ న్యూస్...

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ