గోల్డ్ చైన్ దొంగిలించిన మహిళను అరెస్టు చేసిన ఆర్కేపీ పోలీసులు-మందమర్రి సిఐ రమేష్

గోల్డ్ చైన్ దొంగిలించిన మహిళను అరెస్టు చేసిన ఆర్కేపీ పోలీసులు 

మందమర్రి సిఐ రమేష్ ప్రకటన 


జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ ఛానల్ న్యూస్...

రామకృష్ణాపూర్ న్యూస్,మార్చి-5,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్:మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల రామకృష్ణాపూర్ లో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును రామకృష్ణాపూర్ పోలీసులు చేదించినట్లు మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పి.రమేష్ తెలిపారు.ఆ క్రమంలో చూస్తే..2 మార్చి 2026 న రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల సింగరేణి ఏరియా హాస్పిటల్ దగ్గర ఒక  మహిళ మెడలో నుంచి బంగారు పూస్తేలత్రాడు,సెల్ ఫోన్  దొంగతనం జరిగింది.ప్రధానంగా గాజoగి శ్రావణి అనే ఐబికాలనీ  గోధవరిఖని చెందిన మహిళను తాను గాథలో పరిచయం ఉన్న లాస్య  మభ్య పెట్టింది.దాంతో గోదావరిఖని నుంచి గల సింగరేణి ఏరియా హాస్పిటల్ రామకృష్ణాపుర్ తీసుకు వచ్చింది.శ్రావణి టాయిలెట్ కి వెళ్ళగా వెనుకలనే లాస్య వచ్చి వెనుక ఆమె మెడలో గల బంగారు పుస్తేలత్రాడు లాక్కొని తోసి వేయడంతో బాధితురాలు కింద పడిపోయింది.ఆమె మెడలో గల బంగారు   పుస్తెలత్రాడు,మొబైల్  ఫోన్ తీసుకొని రోడ్డు వైపు వచ్చి ఆ సమయంలో శ్రీరాంపూర్ వైపునకు వెళుతున్న ఆటోలో లాస్య ఎక్కి పారిపోయినట్లు మందమర్రి సీఐ పి.రమేష్ తెలిపారు.ఆ సంఘటన పై సమాచారం అందుకున్న రామకృష్ణాపుర్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు ప్రకటించారు.ఆ నేపథ్యంలోనే రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ అంబర్ కిషోర్ జా (డి.ఐ.జి)ఐపిఎస్,మంచిర్యాల డిసిపి ఎగ్గడి భాస్కర్ ఐపీఎస్ ఆదేశాలు మేరకు బెల్లంపల్లి ఎసిపి రవికుమార్ ఆధ్వర్యంలో రామకృష్ణాపుర్ పోలీస్ సిబ్బంది రెండు  బృందాలుగా ఏర్పడి సీసీ కెమెరాలు పరిశీలించి చూసారు.సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆ నిందితురాలి  ఆచూకీ కోసం వెతకగా పోలీసులకు ఉన్న సమాచారం మేరకు ఆ చైన్ స్నాచింగ్ చేసిన దొంగ శ్రీరాంభట్ల  మనస్విని @అనూష,@యస్మిన్ @ లాస్య ఎమ్మెస్ అసొసేట్ బ్యాంక్, ప్రైవేటు ఉద్యోగి,నివాసం: ఆర్కే-6 , కొత్త రోడ్డు ,శ్రీరాంపూర్ సిసిసి నస్పూర్ ప్రస్తుతం గాయిత్రి హాస్టల్ బెల్లoపల్లి చౌరాస్తా దగ్గర మంచీర్యాలలో గురువారం ఆ దొంగ సొత్తును అమ్మడానికి ముఖారం చౌరాస్తా మంచీర్యాలకు వెళ్ళింది. ఆ సమయంలో రామకృష్ణాపుర్ ఎస్సై జే.శ్రీధర్ పోలీసు సిబ్బందితో కలిసి దొంగతనం చేసిన సొత్తును ఆమెను అరెస్టు చేసి రికవరీ  చేశారు.ఆ సందర్భంగా మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్  ఆఫ్ పోలీస్ పర్శ రమేష్   మాట్లాడుతూ...నేరస్తురాలు  శ్రీరాంభట్ల  మనస్వినీ మంచీర్యాల అను ఆమె  జల్సాలకు అలవాటు పడి దొంగగా మారినట్లు తెలిపారు. ఆ నిందితురాలు  జల్సాలకు అలువాటు పడి,భర్తను,కొడుకును వదిలి మంచీర్యాలలో నివాసం ఉంటూ దొంగతనలకు పాల్పడినట్లు గుర్తు చేశారు.ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వెంటనే ఆ సంఘటనపై పోలీసులు స్పందించడమే కాక దొంగను పట్టుకున్నట్లు పేర్కొన్నారు.ఆ కేసును చేదించడంలో ప్రముఖ పాత్ర వహించిన రామకృష్ణాపూర్ ఎస్సై జే శ్రీధర్ సిబ్బందిని అభినందించి వాళ్లకు రివార్డు అందజేశారు.ఆ కార్యక్రమంలో మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ పర్శ రమేష్,రామకృష్ణాపూర్ ఎస్ఐ శ్రీధర్,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

ఆర్కేపిలో ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి-ఫ్లాష్..ఫ్లాష్ న్యూస్...

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ