పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను అప్పగించిన ఆర్కేపి పోలీసులు

పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను అప్పగించిన ఆర్కేపీ పోలీసులు 

-- ఎస్ఐ జే.శ్రీధర్

-- జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ ఛానల్ న్యూస్...

రామకృష్ణాపూర్ న్యూస్,మార్చి-14,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్: మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను సీఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్)పోర్టల్ ద్వారా గుర్తించి పెద్ద సంఖ్యలో రికవరీ చేసినట్లు రామకృష్ణాపూర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జే.శ్రీధర్ తెలిపారు.ఆ క్రమంలో చూస్తే...రికవరీ చేసిన(5)మొబైల్ ఫోన్లను వాళ్ల యొక్క యాజమానులకు శనివారం ఎస్సై అందించారు.ఆ మొబైల్ ఫోన్లు తిరిగి పొందిన సెల్ ఫోన్ల యొక్క యాజమానులు ఆనందం వ్యక్తం చేశారు.ఆ సందర్భంగా ఎస్‌.ఐ శ్రీధర్ మొబైల్ ఫోన్లను గుర్తించి రికవరీ చేయడంలో కృషి చేసిన సీఈఐ ఆర్ పోర్టల్ ఆపరేటర్ పి.సి.ఎం.అఖిల్ ను అభినందించారు.అలాగే రికవరీలో సహకరించిన పోలీస్ ఐడి పార్టీ సిబ్బంది హెచ్‌.సి.కె.జంగు,పి.సి.వెంకటేష్ లను కూడా అభినందించారు.ఆ సీఈఐ ఆర్ పోర్టల్ ను భారత టెలికమ్యూనికేషన్స్ శాఖ ప్రవేశపెట్టింది.ప్రధానంగా మొబైల్ పోయినప్పుడు లేదా దొంగిలించబడినప్పుడు ఐఎంఈఐ నంబర్ ద్వారా ఈ పోర్టల్‌లో నమోదు చేసి బ్లాక్ చేయవచ్చు.ఒకసారి బ్లాక్ చేసిన తర్వాత ఆ మొబైల్ ఫోన్ దేశంలోని ఏ నెట్‌వర్క్‌లో కూడా పనిచేయదు.దాని ద్వారా పోలీసులు మొబైల్ ఫోన్లను ట్రేస్ చేసి రికవరీ చేయగలుగుతున్నారు.ప్రజలు తమ మొబైల్ ఫోన్లు పోయిన వెంటనే సీఈఐఆర్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని,సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు సూచిస్తున్నారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

ఆర్కేపిలో ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి-ఫ్లాష్..ఫ్లాష్ న్యూస్...

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ