రేపు కల్వరి టెంపుల్ దైవజనులు సతీష్ కుమార్ మంచిర్యాల రాక-తరలిరావాలి
రేపు కల్వరి టెంపుల్ దైవజనులు సతీష్ కుమార్ మంచిర్యాల విచ్చేస్తున్నారు
జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ ఛానల్ న్యూస్...
మంచిర్యాల న్యూస్,మార్చి-2,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్:మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల గద్దెరాగాడి ప్రాంతంలోని ఎమ్మార్ గార్డెన్స్ లో గల కల్వరి టెంపుల్ లో మంగళవారం భారీ ఎత్తున నిర్వహించే విద్యార్థుల విశ్వాసుల విజ్ఞాపన సదస్సుకు కల్వరి టెంపుల్ వ్యవస్థాపకులు దైవజనులు కాబడిన డాక్టర్ పి.సతీష్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు.ఆ క్రమంలో చూస్తే..గద్దె రాగాడి ప్రాంతంలో గల లడ్డ రైస్ మిల్ ఎదురుగా ఉన్న ఎమ్మార్ గార్డెన్స్ లోని కల్వరి టెంపుల్ లో ఈనెల-3న సాయంత్రం 6 గంటలకు పెద్ద ఎత్తున నిర్వహించే విద్యార్థిని విద్యార్థుల కోసం నిర్వహించే సదస్సుకు దైవజనులు సతీష్ కుమార్ విచ్చేస్తున్నారు.దైవజనులు రాకతో కల్వర్ టెంపుల్ వద్ద ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు.అంతేకాకుండా ఆ సదస్సుకు సంబంధించిన వాల్ పోస్టర్లు,ఫ్లెక్సీలను కూడా జిల్లా వ్యాప్తంగా అన్ని ముఖ్యమైన ప్రాంతాలు,చౌరస్తాలు,ప్రధాన కూడలిలో ఏర్పాటు చేయడంతో ప్రచారం కూడా ముమ్మరంగా చేస్తున్నారు.ముఖ్యంగా పదవ తరగతి పరీక్షలు వ్రాసే విద్యార్థిని విద్యార్థులు,ఇంటర్ పరీక్షలు వ్రాస్తున్న విద్యార్థులు,ఇతర కాంపిటేషన్ ఎగ్జామ్స్ వ్రాసే విద్యార్థిని-విద్యార్థులు అలాగే నిరుద్యోగులు కాబడిన యువతి యువకుల కోసం యేసుక్రీస్తు ప్రభువు ఆశీర్వదించాలని విద్యార్థులందరూ కూడా సమస్యలు తలెత్తకుండా మంచిర్యాంకుతో ఉత్తీర్ణత సాధించాలని ప్రార్థనలు చేస్తారు.ప్రధానంగా ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రంలోని సుమారు 28 కల్వరి టెంపుల్ సంఘాలు స్థాపించి అందరికోసం ప్రతినిత్యం దేవుని పరిచర్య ద్వారా విశేషమైన సేవలు అందిస్తున్న దైవజనులు సతీష్ కుమార్ మంచిర్యాలకు వస్తున్న దృష్ట్యా తల్లిదండ్రులు వాళ్ల యొక్క పిల్లలను నిరుద్యోగ యువతీ యువకులను వెంటబెట్టుకొని రావాలని మంచిర్యాల కల్వరి టెంపుల్ నిర్వాహకులు కోరుతున్నారు.ఆ నేపథ్యంలోనే విద్యార్థిని విద్యార్థులు ఎగ్జామ్స్ లో ఉత్తీర్ణత సాధించాలని ఇబ్బందులు తలెత్తకుండా ఏసుక్రీస్తు ప్రభువు దేవుడు ఆశీర్వదించాలని దైవజనులు సతీష్ కుమార్ ప్రత్యేకమైన ప్రార్థనలు చేయడమే కాకుండా నిరుద్యోగ యువతీ యువకుల కోసం దేవుని సందేశం అందిస్తారని ప్రకటించారు.దాంతో మంచిర్యాల జిల్లా వ్యాప్తంగానే కాకుండా చుట్టుపక్కల జిల్లాలకు చెందిన తల్లిదండ్రులు,విద్యార్థిని విద్యార్థులు,యువతి యువకులు అధిక సంఖ్యలో హాజరై కల్వరి టెంపుల్ దైవజనులు పి.సతీష్ కుమార్ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభుకు చేసే ప్రార్థనలు ఆశీర్వాదం ద్వారా పొందాలని స్పష్టం చేశారు.కాగా ఏసుక్రీస్తు ప్రభు దేవుడు అందించే మంచి ఆశీర్వాదములు తప్పకుండా అందరూ స్వీకరించాలని ఆ మంచి ధన్యత అందరికి ఉండాలంటే తప్పకుండా ఎం ఆర్ గార్డెన్స్ లో చేపడుతున్న విజ్ఞాపన సదస్సుకు వందలు,వేల సంఖ్యలో హాజరై దేవుని కృపకు పాత్రులు కావాలని క్రీస్తు ప్రభువు దీవెనలు మెండైన ఆశీర్వాదములు కూడా నమ్మకం ప్రగాఢమైన విశ్వాసంతో పొందాలని తెలిపారు.

Comments
Post a Comment