ముస్లిం సోదరులకు పవిత్ర మాసం రంజాన్ తో ఇఫ్తార్ విందు-మంత్రి వివేక్






ముస్లిం సోదరులకు పవిత్ర మాసం రంజాన్ తో ఇఫ్తార్ విందు

-- రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్

జైపూర్ న్యూస్,మార్చి-19,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్:ముస్లిం సోదరులకు పవిత్ర మాసమైన రంజాన్ పండుగను పురస్కరించుకొని ప్రభుత్వం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందుతో పాటు తోఫా అందిస్తుందని గురువారం రాష్ట్ర కార్మిక,ఉపాధి శిక్షణ,కర్మాగార,గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద తెలిపారు.మంచిర్యాల జిల్లాలోని జైపూర్ మండలం  ఇందారం గ్రామంలోని మసీదులో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు,తోఫా పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్,మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాబు రావులతో కలిసి హాజరయ్యారు.ఆ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ..రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందుతో పాటు తోఫా అందిస్తుందని తెలిపారు.జైపూర్ మండలానికి 350 మంజూరు చేయగా ఇందారం గ్రామానికి 250 కేటాయించడం జరిగిందని తెలిపారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా ప్రజా ప్రతినిధులు,అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలలో పారిశుధ్యం,త్రాగునీరు,ప్రభుత్వ కార్యాలయాలలో పెండింగ్ పైళ్ళ క్లియరెన్స్,ఇతర కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని,ఇందులో భాగంగా ప్రజాప్రతినిధులకు కార్యక్రమం అమలుపై శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపారు.నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే విధంగా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు ఏర్పాటు చేసి పలు రకాల వృత్తి విద్యలో శిక్షణ అందించి ఉద్యోగ, వ్యాపార అవకాశాలు కల్పించేందుకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.అనంతరం ఈద్ కా తోఫా కార్యక్రమంలో భాగంగా ముస్లిం సోదరులకు కానుకలు అందజేసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.మసీదు సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ షెడ్ ను ప్రారంభించారు.అనంతరం క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలోని ఎ-జోన్ లో గల బిలాల్ మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి హాజరయ్యారు.ఆ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు,ముస్లిం మత పెద్దలు,తదితరులు పాల్గొన్నారు.

-- ఆర్కేపి గణేష్ ఆలయంలో ఉగాది వేడుకలు-పంచాంగ శ్రవణంలో మంత్రి వివేక్....

రామకృష్ణాపూర్,మార్చి-19,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్: ఉగాది పర్వదినం పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల రామకృష్ణాపూర్‌లోని గణేష్ టెంపుల్‌లో గురువారం నిర్వహించిన వేడుకల్లో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి హాజరైనారు.ఆ సందర్భంగా ఆలయంలో జరిగిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో మంత్రి ప్రత్యేక పూజలు చేసారు.అనంతరం ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరికీ ఆయురారోగ్యాలు,సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు.ఆ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు రఘునాథ రెడ్డి,టౌన్ ప్రెసిడెంట్ పల్లె రాజు,20వ వార్డు కౌన్సిలర్ కూతురు ప్రభాకర్ తదితర నాయకులు పాల్గొన్నారు.

-- క్యాతనపల్లి మున్సిపాలిటీ బిలాల్ మసీదులో ఇఫ్తార్ విందులో మంత్రి వివేక్.....

రామకృష్ణాపూర్ న్యూస్,మార్చి-19,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్: రంజాన్ మాసం సందర్భంగా క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని బిలాల్ మసీదు (ఏజోన్)లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక మరియు గనుల శాఖ మంత్రి డా.జి.వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు.ఆ సందర్భంగా మంత్రి ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస విరమణ చేసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.సమాజంలో సౌహార్దం,సోదరభావం మరింత పెరగాలని ఆకాంక్షించారు.ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు.ఆ కార్యక్రమంలో స్థానిక నాయకులు,ప్రజాప్రతినిధులు,ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

ఆర్కేపిలో ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి-ఫ్లాష్..ఫ్లాష్ న్యూస్...

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ