పది పరీక్షలతో ఎగ్జామ్స్ సెంటర్లు వద్ద నిషేధాజ్ఞలు అమలు
రామకృష్ణాపూర్ ఎస్ఐ జే.శ్రీధర్
పరీక్షలు రాసే విద్యార్థులందరికీ పోలీసుల శుభాకాంక్షలు
జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్...
రామకృష్ణాపూర్ న్యూస్,మార్చి-13,జర్నలిస్టు తెలుగు దిన పత్రిక-టీవీ ఛానల్ న్యూస్:విద్యార్థులందరూ కూడా 365 రోజులు ఎంతో కష్టపడి చదువుకొని శనివారం నుంచి జరిగే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ లలో ఆ మూడు గంటల్లోనే ప్రజెంట్ ఇవ్వాల్సి ఉంటుంది.విద్యార్థులు అందరూ కూడా ధైర్యంగా కాన్ఫిడెంట్గా ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామ్స్ వ్రాసి మంచి ఫలితాలు సాధించాలని శుక్రవారం రామకృష్ణాపూర్ పోలీసులు కోరుతున్నట్లు పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జే.శ్రీధర్ తెలిపారు.పదవ తరగతి పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు ఆ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.పట్టణ పరిధిలోని పరీక్ష కేంద్రాల వద్ద శాంతిభద్రతల రక్షణలో భాగంగా సెక్షన్ 163 బి ఎన్ ఎస్ ఎస్(144 సెక్షన్)అమలు చేస్తున్నట్లు తెలిపారు.రామకృష్ణాపూర్ పరిధిలోని మొత్తం 2 పరీక్ష కేంద్రాల్లో 14 మార్చి నుంచి ఏప్రిల్ 16-2026 వరకు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.ఆ పరీక్షల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలుగా సంబంధిత నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని ఎస్ఐ తెలిపారు.1.పరీక్ష కేంద్రాల పరిసరాల్లో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమికూడరాదనీ గుర్తు చేశారు.2.సభలు,సమావేశాలు,ర్యాలీలు,ధర్నాలు నిషేధంగా ప్రకటించారు.3.పరీక్ష కేంద్రాల నుంచి 500 మీటర్ల పరిధిలోని అన్ని జిరాక్స్ కేంద్రాలు తేది నేటి నుంచిఏప్రిల్ 16 నుంచి ప్రతిరోజూ ఉదయం 6:00 గంటల నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకు మూసివేయాలని ఎస్సై శ్రీధర్ ఆదేశించారు.ఎవరైనా సంబంధిత ఉత్తర్వులను అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడుతాయని ఎస్ఐ హెచ్చరించారు.

Comments
Post a Comment