ఆర్కేపి భగత్ సింగ్ నగర్ ప్రధాన రహదారిపై వెంటనే స్పీడ్ బ్రేకర్లు వేయాలి
ఆర్కేపి భగత్ సింగ్ నగర్ ప్రధాన రహదారిపై తక్షణమే స్పీడ్ బ్రేకర్లు వేయాలి
జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్...
రామకృష్ణాపూర్ న్యూస్,మార్చి-16,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్:మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని భగత్ సింగ్ నగర్ లో ప్రధాన రహదారిపై వెంటనే స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని పట్టణ ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.ఆ క్రమంలో చూస్తే..భగత్ సింగ్ నగర్ లోని గణేష్ టెంపుల్ నుంచి విఠల్ నగర్ చౌరస్తా వరకు తక్షణమే ఆ రోడ్డుపై స్పీడ్ బ్రేకర్లు వేయాలని దాంతో రోడ్డు ప్రమాదాలు లేకుండా చూడాలని క్యాతనపల్లి మున్సిపాలిటీ కమిషనర్(ఆఫీసర్)ను స్థానిక ప్రజలు కోరుతున్నారు.ముఖ్యంగా క్యాతనపల్లి కమిషనర్ అధికారి కాబడిన మారుతి ప్రసాద్ వెంటనే అక్కడి సమస్యలపై స్పందించాలని రోడ్డు ప్రమాదాల బారి నుంచి ప్రజలను రక్షించాలని స్థానికులు కోరుతున్నారు.ఇటీవల కాలంలో జరిగిన అక్కడి రోడ్డు ప్రమాదంలో స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం వల్లనే అతి స్పీడ్ గా వస్తున్న వాహనాలతో పాటు అలాగే పశువులు ఎక్కువగా అక్కడి ప్రధాన రోడ్ పై ఉండడం చేత ఆరోజు అభం శుభం తెలియని ఒక మహిళ ట్రాక్టర్ కిందపడి ప్రాణాలు గాలిలో కలిసిపోయినట్లు వాపోతున్నారు.అక్కడి ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే వెంటనే స్పీడ్ బ్రేకర్లు వేయాలని దాంతో వాహనాలు అతివేగంగా వెళ్లకుండా తగిన చర్యలు తీసుకునేలా చూడాలని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయమై జర్నలిస్టు డైలీ న్యూస్ పేపర్-జర్నలిస్టు టీవీ ఛానల్ ద్వారా మున్సిపాలిటీ కమిషనర్ ఇంకా సంబంధిత అధికారులు దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది.వెంటనే అక్కడి రోడ్డుపై స్పీడ్ బ్రేకర్లు వేయాలని దాంతో అక్కడి ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూడాలని జర్నలిస్ట్ టీవీ ఛానల్ ద్వారా తెలుపుతున్నాము.మరిన్ని వివరాలతో మళ్ళీ కలుద్దాం..జర్నలిస్టు టీవీ ఛానల్ న్యూస్ నిరంతరం క్రమం తప్పకుండా వీక్షించండి.

Comments
Post a Comment