మందకృష్ణ మాదిగకు క్షీరాభిషేకం చేసిన ఆర్కేపి మాదిగ దండోరా
మందకృష్ణ మాదిగకు క్షీరాభిషేకం చేసిన ఆర్కేపి మాదిగ దండోరా
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ గత 30 సంవత్సరాలుగా అంటే దాదాపు మూడు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం చేసిన విరోచితమైన పోరాటం కృషి ఫలించాయి.ఆ వర్గీకరణ కోసం న్యాయవ్యవస్థ తీర్పు కూడా ఇచ్చిన విషయం తెలిసిందే.అయితే రెండు రోజుల క్రితం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది.ఆ విషయాన్ని పరిగణగలోకి తీసుకొని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ లోని సీఎస్పీ ముందు గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి స్థానిక ఎమ్మార్పీఎస్ నాయకులు దళిత నాయకులు అందరూ కలిసి ఐకమత్యంతో క్షీరాభిషేకం చేశారు.ఆ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు సరేష్,బిజెపి నాయకులు ఆరు ముళ్ల పోశం,పోచం,జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్ చైర్మన్ కలువల శ్రీనివాస్ మాట్లాడుతూ... దళితులను ఉద్దేశించి ప్రసంగించారు.ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ దళితుల కోసం దళిత కుటుంబాల అభివృద్ధి కోసం దళితుల భవిష్యత్తు కోసం ఎస్సీ వర్గీకరణ కోసం గత 30 సంవత్సరాలుగా చేసిన ఆందోళనతో ఆయన చేసిన ప్రయత్నం జేజేలు కొడుతూ ఫలించినట్లు వివరించారు.అలాగే రాబోయే కాలంలో మంద కృష్ణ మాదిగ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి కోసం మరొకసారి ఆందోళన ఉదృతం చేయబోతున్నట్లు దానికి దళిత సోదరులందరూ ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు దండోరా ప్రజలందరూ కూడా ఐకమత్యంతో నిరసనలు ఉదృతం చేయడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.దానికి ముందు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి దళిత దండోరా సోదరులు ఘనంగా నివాళులర్పించారు.ఆ కార్యక్రమంలో దళిత సంఘం స్థానిక నాయకులు కళ్యాణ్,పూర్ణ చందర్,సలిగోమ్ముల రమేష్,ఆగయ్య,మాదిగ దండోరా కార్యకర్తలు,
తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment