అమ్మాయితో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తి అరెస్టు
అమ్మాయితో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తి అరెస్టు
ఆర్కేపి ఎస్ ఐ జి.రాజశేఖర్
రామకృష్ణాపూర్ లో నివసించే ఒక వ్యక్తి 10 సంవత్సరాల బాలిక యొక్క
నోరుమూసి ఆ అమ్మాయిని అతని ఇంట్లోకి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించినట్లు మంగళవారం పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి.రాజశేఖర్ తెలిపారు.ఆ క్రమంలో చూస్తే..అమ్మాయి యొక్క తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ వ్యక్తి పై(పి ఓ సి ఎస్ ఓ) కేసు నమోదు చేసి అతని కోర్టులో మేజిస్ట్రేట్ ముందు హాజరు హాజరు పరిచినట్లు ప్రకటించారు.
-- యువత మొబైల్స్ కు బానిసలుగా ఉండకూడదు
నేటి యువత మొబైల్స్ కు బానిసలుగా మారిపోయి వాళ్ళ యొక్క భవిష్యత్తును ఇంకా జీవితాలను నాశనం చేసుకోవద్దని ఎస్ఐ జి.రాజశేఖర్ తెలిపారు. పట్టణంలోని సెయింట్ జాన్స్ స్కూల్లో పోలీసులు కమ్యూనిటీ ప్రోగ్రాం నిర్వహించారు. ఆ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు అనేక విషయాలను గుర్తు చేశారు. కాగా మొబైల్స్ లలో గుర్తుతెలియని వెబ్సైట్స్ లను వాటి ద్వారా వచ్చిన వెబ్ లింక్స్ లను ఓపెన్ చేయడంతో అస్లీలమైన వీడియోలను చూస్తున్నారని దానివలన నేరాలకు పాల్పడి భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నట్లు తెలిపారు. అనే పద్యంలోనే తల్లితండ్రులు తమ పిల్లలను వాళ్ళు ఉపయోగిస్తున్న మొబైల్స్ ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఏది మంచి -చెడు అనేది వాళ్లకు వివరించాలని ఎస్సై ప్రకటించారు.ఎవరైనా మహిళల పట్ల అయిన, అమ్మాయిల పట్ల అయినా అసభ్యంగా లేదా అమర్యాదగా ప్రవర్తిస్తే ఆ వ్యక్తుల మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.ఒకవేళ ఏదైనా ఆన్లైన్ మోసం జరిగినప్పుడు వెంటనే 1930 అను నంబర్ కాల్ చేసి ఆ సైబర్ క్రైమ్ పోలీసు వారికి వెంటనే ఫిర్యాదు చేయాలని అలా చేస్తే తక్షణ న్యాయం జరిగే అవకాశం ఉన్నదని ఎస్ఐ తెలిపారు. ఆ కార్యక్రమంలో మంచిర్యాల షీ - టీమ్ సిబ్బంది,హెడ్ కానిస్టేబుల్ జంగు,కానిస్టేబుళ్ళు ఓంకార్,బాలకృష్ణ,సతీష్,సమ్మయ్యలు పాల్గొన్నారు.
Comments
Post a Comment