ఎదుటివారికి ఇబ్బంది లేకుండా మహిళలతో మర్యాదగా ఉండాలి

ఎదుటివారికి ఇబ్బంది లేకుండా మహిళలతో మర్యాదగా ఉండాలి

--  సంప్రదాయ పద్ధతుల్లో హోలీ జరుపుకుందాం

--  రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిశోర్ ఝా

--  జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్...

మంచిర్యాల న్యూస్ మార్చి-13 జర్నలిస్టు తెలుగు దినపత్రిక : ఎదుటివారికి అసలు ఇబ్బంది కలిగించకుండా మహిళల పట్ల ముందు మర్యాదగా ఉంటూ సంప్రదాయ పద్ధతుల్లోనే హోలి జరుపుకుందామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ప్రజలకు పిలుపునిచ్చారు.ఆ క్రమంలో చూస్తే..



హోలీ పండుగ సందర్బంగా పోలీస్ కమిషనర్  ప్రజలకు అనేక సూచనలు చేశారు.సహజ సిద్దమైన రంగులను వినియోగిస్తూ హోలీ పండుగను ప్రశాంతవంతమైన వాతావరణంలో జరుపుకోవాలన్నారు.ముఖ్యంగా ఎవరు కూడా మద్యం సేవించి వాహనాలు నడపవద్దని తెలిపారు.హోలీ అనంతరం యువత స్నానాల కోసం పట్టణ గ్రామ శివారు ప్రాంతాల్లోని చెరువులు,లోతట్టు ప్రాంతాలకు వెళ్ళవద్దన్నారు. ప్రధానంగా బహిరంగ ప్రదేశాలపై,అనుమతి లేకుండా   వ్యక్తులపై,మహిళలు,యువతులు,వాహనాలపై రంగులు చల్లడం బైకులపై,కార్లల్లో గుంపులుగా తిరిగి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై చర్యలు తప్పవన్నారు.హోలీ పండుగను సజావుగా జరుపుకొనేందుకు రామ గుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముమ్మర పెట్రోలింగ్ చేపడుతున్నట్లు ప్రకటించారు.ప్రజలను ఇబ్బందులకు గురి చేసే వారిపై పోలీస్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని పోలీస్ కమిషనర్ తెలిపారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి