అంతర్జాతీయ మహిళ దినోత్సవంతో ఠాగూర్ స్టేడియంలో మహిళలకు ఆటల పోటీలు
-- అంతర్జాతీయ మహిళ దినోత్సవంతో ఠాగూర్ స్టేడియంలో మహిళలకు ఆటల పోటీలు
-- విజేతలకు బహుమతులు ప్రధానం
అంతర్జాతీయ మహిళ దినోత్సవం పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల సింగరేణి ఠాగూర్ స్టేడియంలో మంగళవారం క్యాతనపల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన మహిళలకు అనేకరకాల పోటీలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాటల పోటీలు,ఆటల పోటీలు,కబడ్డీ,లెమన్ స్పూన్,టాగ్ ఆఫ్ వార్,మ్యూజికల్ చైర్,బంప్ బ్లాస్ట్ పోటీలను చూడచక్కగా నిర్వహించారు.అనంతరం పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.
అలాగే మహిళలకు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో క్యాతనపల్లి మున్సిపాలిటీ కమిషనర్ జి.రాజు,రెండవ అదనపు ఎస్ఐ లలిత,డాక్టర్ మానస,పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకులు పల్లె రాజు, రఘునాథరెడ్డి,మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం కల,మాజీ కౌన్సిలర్లు,మహిళలు,తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment