ఈనెల 19న భూమి మీదికి రానున్న సునీతా విలియమ్స్?

ఈనెల 19న భూమి మీదికి రానున్న సునీతా విలియమ్స్



?

--  జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్...

హైదరాబాదు న్యూస్ మార్చి-16 జర్నలిస్టు తెలుగు దినపత్రిక : అంతరిక్షంలో చిక్కుకు పోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్,బారీ బుచ్ విల్‌మోర్ భూమిపైకి తిరిగి రాబోతున్నారు.ఆ క్రమంలో చూస్తే..నాసా ప్రకారం..భూమి మీదకు ఈ నెల 19,20 తేదీల్లో తిరిగి రావొచ్చునని స్పష్టం చేసింది.అయితే గత10 నెలలుగా అంతర్జాతీ య అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఉంటున్న ఆ ఇద్దరు వ్యోమగాములు ఎట్టకేలకు భూమిపైకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు.గత కొన్నినెలల క్రితమే 58 ఏళ్ల సునీతా విలియమ్స్,61 ఏళ్ల విల్‌మోర్ బోయింగ్ స్టార్‌లైనర్ అంతరిక్షనౌకలో అంతరిక్షానికి పయనమైయ్యారు. ఆ కొత్త వ్యోమనౌక పనితీరును పరీశీలించేందుకు సునీతా,విల్‌మోర్‌ స్పేస్‌కు వెళ్లారు.కానీ ఊహించని పరిణామాలతోనే జూన్ 5న ఫ్లోరిడాలో టేకాఫ్ అయిన వెంటనే సాంకేతిక సమస్యలు తలెత్తాయి.నాసా అధికారులు అక్కడి సాంకేతిక సమస్యలను అర్ధం చేసుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశారు.కానీ ఆ ఫలితం శూన్యం.ఆ నేపథ్యంలోనే చేసేది ఏమిలేక వ్యోమగాములను అంతరిక్ష నౌకలోనే వదిలేసి స్టార్ లైనర్ సెప్టెంబరు7, 2024న భూమిపైకి తిరిగి వచ్చింది.ఆ పరిస్థితుల్లో భూమిపైకి ఇద్దరు వ్యోమగాములను తీసుకురావడం ప్రమాదకరమని నాసా భావించింది.ఆ తర్వాత విల్‌మోర్‌,సునీత విలియమ్స్ ఇద్దరూ అంతరిక్షంలోనే ఉండిపోవాల్సి వచ్చింది.ముందుగా స్పేస్ ఎక్స్ డ్రాగన్‌ ద్వారా వారిద్దరిని భూమిపైకి తీసుకురావాలని భావించారు.అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఆ ఇద్దరిని వెనక్కి తీసుకొచ్చే బాధ్యతను స్పేస్ఎక్స్ అధినేత ఎలన్ మస్క్‌కు అప్పగించారు.అయితే మంచిగా చేరాలని వేచి చూద్దాం...


నాసా ప్రకారం.. సునీతా, విల్ మోర్ ఈ నెల 19, 20 తేదీల్లో భూమిపైకి తిరిగి రావచ్చు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి