పాస్టర్ ప్రవీణ్ మృతిపై అనుమానం?

పాస్టర్ ప్రవీణ్ మృతిపై అనుమానం?

పాస్టర్ ప్రవీణ్ మరణం రోడ్డు ప్రమాదమా లేక హత్య

--  ఆర్కేపి యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం ప్రకటన

రామకృష్ణాపూర్ న్యూస్ మార్చి-25 జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్ : పాస్టర్ పగడాల ప్రవీణ్  మరణం అసలు రోడ్డు ప్రమాదమేనా ? లేక మతోన్మాద హత్యనా? ఆ విషయంలో విచారణ చేసి పోలీసులు ఇంకా ప్రభుత్వం తేల్చాలని రామకృష్ణాపూర్ యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం కమిటీ డిమాండ్ చేసింది.ఆ క్రమంలో చూస్తే..సోమవారం రాత్రి పాస్టర్ ప్రవీణ్  విజయవాడ నుంచి బయలు దేరి రోడ్డు మార్గంలో రాజమండ్రికి వస్తూండగా రహదారిలో ఆ దారి ప్రక్కన చెట్ల పొదల్లో పాస్టర్ యొక్క బండితో సహా అతని మృత దేహం పడి ఉండటం చాలా అనుమానానికి దారి తీస్తుందని ప్రకటించారు.ఆ దుర్ఘటనపై ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోని క్రైస్తవ సమాజానికీ న్యాయం చేయలని ఆర్ కే పి యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం డిమాండు చేస్తుందన్నారు.ఆ పాస్టర్ ప్రవీణ్ నేల రోజుల ముందుగానే ఆయనకు ప్రాణహాని ఉందని కూడా తెలిపినట్లు పేర్కొన్నారు.ఒకవేల ఆక్సిడెంట్ అయితే ఆ రోడ్డు పైనా ఎలాంటి గీతలు లెవని అలాగే సడన్ బ్రేక్లు వెస్తే..టైర్లు రాకినా గీతాలు లెవన్నారు.కాగా ఆక్సిడెంట్ అయిన ప్రాంతంలో అక్కడి స్థలంలో రోడ్డు చెరిగిపోయి కూడా లేదన్నారు.కాగా చనిపోయిన పాస్టర్ యొక్క రక్తమంత అతని మోటార్ సైకిల్ మీద ఉందని దాంతో ప్రభుత్వం ఆ పాస్టర్ మృత్తిపై సమగ్ర విచారణ జరిపించి దేశ,రాష్ట్రల,



జిల్లాలకు చెందిన క్రైస్తవ లోకానికి భాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి