క్యాతనపల్లి రైల్వే గేటు 9-రోజులు మూసివేత -గమనించాలి
క్యాతనపల్లి రైల్వే గేటు 9-రోజులు మూసివేత -
-- రైల్వే సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటన
-- జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్...
రామకృష్ణాపూర్ న్యూస్ మార్చి-18 జర్నలిస్టు తెలుగు దినపత్రిక : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని క్యాతనపల్లి రైల్వే గేటు ఈనెల-19 నుంచి 28 తేదీ వరకు మూసివేస్తున్నట్లు రైల్వే సెంట్రల్ గవర్నమెంట్ అధికారులు మంగళవారం ప్రకటించారు.ఆ క్రమంలో చూస్తే..క్యాతనపల్లి మున్సిపాలిటీ ఆఫీసు పక్కనే ఉన్న సంబంధిత రైల్వే గేటు యొక్క రైల్వే ట్రాక్ లైన్ మరమ్మతులను ఒక రైల్వే ట్రాక్ లైన్ మూడు నెలలకు ఒకసారి చేసే పనులలో భాగంగా సేఫ్టీ కోసం ఆ పనులు చేపడుతున్నారు.దాంతో దాదాపు 9 రోజులు క్యాతనపల్లి రైల్వే గేటు మూసి ఉంటుందని సంబంధిత అధికారులు ప్రకటించారు.ఆ విషయాన్ని ప్రజలందరూ కూడా మంచిగా గమనించి సహకరించాలని ఎమ్మార్వో,ఎస్సై, మున్సిపాలిటీ కమిషనర్, మంచిర్యాల ఆర్టీసీ డిపో మేనేజర్ తో పాటు సంబంధిత అధికారులకు కూడా ఆ రైల్వే అధికారులు రైల్వే గేటు మూసివేత చేపడుతున్నట్లు నోటీసు ద్వారా ప్రకటించారు.
Comments
Post a Comment