తెలంగాణలో మండుతున్న ఎండలు

తెలంగాణలో మండుతున్న ఎండలు  


హైదరాబాద్ న్యూస్ మార్చి-28 జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా ఎండల తీవ్రత పెరుగుతుంది.ఆ క్రమంలో చూస్తే..దాని ప్రభావంతో వడ గాలులు కూడా జోరుగానే వీస్తున్నాయి.ఇక నేడు తెలంగాణలోని15 జిల్లాలకు హైదరాబాద్ లోని వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.ఆదిలాబాద్,కొత్తగూడెం,జగిత్యాల,జయశంకర్ భూపాలపల్లి,జోగులాంబ గద్వాల్,ఖమ్మం,కొమరంభీం,మంచిర్యాల,ములుగు,నాగర్ కర్నూల్,నారాయణపేట్,నిర్మల్,నిజామాబాద్,పెద్దపల్లి,వనపర్తి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ హెచ్చరికలు జారీ చేశారు.అయితే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో గరిష్టంగా 41 డిగ్రీలు ఉష్ణోగ్రతలు దాటి పోతున్నాయి.నేటి నుంచి మరింతగా ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని చెప్పుకొచ్చారు. అలాగే ఉత్తర తెలంగాణలోని పలు జిలాల్లో 45 డిగ్రీల వరకు టెంపరేచర్స్ నమోదయ్యే అవకాశం ఉంది.అయితే ప్రజలు మధ్యాహ్నం సమయంలో బయటికి రావొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.అవసరం అయితేనే తప్పా ఇంటి నుంచి బయటకు రావొద్దన్నారు. బయటకు వెళ్ళినప్పుడు టోపీ,గొడుగులు లాంటివి ఉపయోగించాలని హెచ్చరించారు.కాగా ఈ రోజు నుంచి మరో మూడు రోజుల పాటు మరింత ఎండ వేడిమి పెరిగే ఛాన్స్ ఉంది.మరో ఐదు రోజుల పాటు రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటుందని హైదరాబాదులోని వాతావరణ కేంద్రం చెప్పింది.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి