ఇందారం1-ఏ గనిలో సైడ్ వాల్ కూలి కార్మికునికి తీవ్ర గాయాలు




ఇందారం1-ఏ గనిలో సైడ్ వాల్ కూలి కార్మికునికి తీవ్ర గాయాలు






-  ఆ గని ప్రమాదంలో ముగ్గురు క్షేమంగా ఉన్నారు

-  జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్....

శ్రీరాంపూర్ న్యూస్ మార్చి-13 జర్నలిస్టు తెలుగు దినపత్రిక : సింగరేణి కాలరీస్ లోని  శ్రీరాంపూర్ డివిజన్ గల ఇందారం-1 ఏ గని భూగర్భంలో పైకప్పు సపోర్టు కోసం కార్మికులు దిమ్మలు కడుతుండగా ఆ భూగర్భ గనిలోని వర్కింగ్ ప్లేస్ లో సైడ్ వాల్ ఫాల్ అయి కూలీ పడటంతో గురువారం అంగలి రాజయ్య అనే సపోర్ట్ మెన్ కార్మికుని ఎడమ కాలు విరిగింది.ఆ క్రమంలో చూస్తే..గని భూగర్భంలోని సెవెన్ లెవెల్ 32- డీప్ లోని అక్కడి పని స్థలంలో పైకప్పు కూలకుండా ఉండడానికి రెండు దిమ్మెలు సంబంధిత కార్మికులు సపోర్టు కోసం పూర్తి చేసి మూడవ దిమ్మె కూడా కడుతున్న సమయంలో ఒక్కసారిగా సైడ్ వాల్ కూలీ రాజయ్య ఎడమ కాలుపై పడింది.దాంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి.అనంతరం వెంటనే బాధిత కార్మికుని రామకృష్ణాపూర్ లోని ఏరియా ఆసుపత్రికి తోటి కార్మికులు తరలించారు.ఆ నేపథ్యంలోనే ఆసుపత్రి వైద్యులు తక్షణమే చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ఆసుపత్రికి రిఫరల్ చేశారు.ఆ సందర్భంగా కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ..రక్షణపై లేని శ్రద్ధ ఉత్పత్తిపై చూపిస్తున్న గని మేనేజ్మెంట్ ఆ కార్మికుడు కాలుజారి కింద పడినట్టు గని ప్రమాదం యొక్క రిపోర్టులో రాసినట్లు తెలిపారు.ఆ విధంగా తప్పుడు రిపోర్ట్ చేయడం వల్ల కార్మికునికి అన్యాయం జరుగుతుందని తెలిపారు.గతంలో కూడా ఇద్దరు కార్మికులపై తప్పుడు రిపోర్టు చేసి గని అధికారులు నష్టం చేసినట్లు గుర్తు చేస్తూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆ సంబంధిత అధికారులపై విచారణ జరిపి అలాంటి చర్యలు పున:రావృతం కాకుండా ప్రధానంగా గని ప్రమాదాలు లేకుండా కార్మికులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి