సురక్షితంగా భూమిపైకి చేరుకున్న సునీతా విలియమ్స్
సురక్షితంగా భూమిపైకి చేరుకున్న సునీతా విలియమ్స్
- జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్...
హైదరాబాద్ న్యూస్ మార్చి 19: భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ మరో వ్యోమగామి, బూచ్ విల్మోర్ లు, ఏట్టకేలకు భూమి పైకి చేరుకున్నారు.ఆ క్రమంలో చూస్తే... దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలోనే ఉండిపోయినా వీరిద్దరూ ఎనిమిది రోజుల మిషన్ కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి.. వ్యోమనౌకలో సాంకేతిక సమస్యల కారణంగా 286 రోజులపాటు అక్కడే చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్ మోర్ ఎట్టకేలకు బుధవారం తెల్లవారు జామున భూమీ మీదకుచేరుకున్నారు.వారి కోసం ప్రత్యేకంగా పంపిన స్పేస్ ఎక్స్ క్రూ-9 డ్రాగన్ క్యాప్సూల్ మంగళవారం ఉదయం 10.35 గంటలకు ఐఎ్‌సఎస్ నుంచి విడిపోయి భూమి దిశగా పయనమైనట్టు నాసా వెల్లడించింది. అందులో సునీత, విల్‌మోర్‌తోపాటు మరో ఇద్దరు వ్యోమగాములు అలెగ్జాండర్ గోర్బనోవ్ (రష్యా), నిక్ హేగ్ (అమెరికా) కూడా ఉన్నారు. ఈ నౌక 17 గంటలపాటు ప్రయాణించి ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో బుధవారం తెల్లవారు జామున 3.27 గంటలకు దిగిందని,నాసా వెల్లడించింది. గంటకు 17వేల మైళ్ళ వేగంతో భూమిపైకి ప్రయాణించిన డ్రాగన్ క్యాప్సుల్ క్రమంగా వేగాన్ని తగ్గించుకుంటూ వచ్చింది. గంటకు వేగం 116 మైళ్ళకు చేరుకున్నాక ప్యారాచూట్ చేర్చుకున్నాయి.దిగగానే నాసా రికవరీ బృందాలు అక్కడికి వెళ్లి వారిని వ్యోమనౌక నుంచి బయటకు తెచ్చి..హ్యూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తరలించి వైద్యపరీక్షలు చేయనున్నట్టు తెలిపింది.దాదాపు 9 నెలలపాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో, భార రహిత స్థితిలో ఉన్న నేపథ్యంలో సునీత, విల్‌మోర్ భూమ్మీదికి తిరిగి రాగానే మామూలుగా నడవలేరని నాసా మాజీ వ్యోమగామి లెరోయ్ చియావో వెల్లడించారు.రోదసిలో ఉన్నప్పుడు శరీరంలోని రక్తం, ఇతర స్రావాలన్నీ పైభాగంలో ఎక్కువగా చేరుతాయని.. దీనివల్ల భూమ్మీదికి వచ్చాక వారు నిలబడితే రక్తపోటు పడిపోయి, కళ్లు తిరిగి పడిపోతారని వివరించారు.ఆ నేపథ్యంలోనే వైద్యపరీక్షలు పూర్తయిన అనంతరం సునీతకు, విల్‌మోర్‌కు ఆరువారాల పాటు రీహ్యాబిలిటేషన్ ప్రోగ్రామ్ నిర్వహిస్తారని,నడక,కండరాల బలోపేతానికి సంబంధించి శిక్షణ ఇస్తారని, పౌష్టికాహారం ఇస్తారని వైద్యనిపుణులు తెలిపారు.
*ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం*
అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉంటే అక్కడి భారరహిత వాతావరణం వల్ల వ్యోమగాముల ఎము కల సాంద్రత తగ్గిపోతుంది. వారి కండరాలు క్షీణిస్తాయి. రక్తనాళాలు సంకోచానికి గురవుతాయి.గుండె, మెదడు, రక్తప్రసరణ వ్యవస్థ ప్రభావితమవు తాయి.మెదడులో స్రావాలు పెరిగి..వినికిడి శక్తి, చూపు మందగిస్తాయి.వ్యోమగాముల మెదడుపై ఒత్తిడి పెరిగి..‘స్పేస్‌ఫ్లైట్ అసోసియేటెడ్ న్యూరో-ఆక్యులార్ సిండ్రోమ్ (శాన్స్)’బారిన పడే ప్రమాదం ఉంటుంది.
Comments
Post a Comment