ప్రమాదానికి గురైన మహిళను హాస్పిటల్ కు తరలించిన డిసిపి
ప్రమాదానికి గురైన మహిళను హాస్పిటల్ కు తరలించిన డిసిపి
-- డీసీపీ భాస్కర్ సేవలపై హర్షం - అభినందనలు
-- జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్...
మంచిర్యాల న్యూస్ మార్చి-12 జర్నలిస్టు తెలుగు దినపత్రిక : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోగల మంచిర్యాల డిసిపి ఏ.భాస్కర్ (ఐపిఎస్) మంచిర్యాల నుంచి లక్షేట్టిపేట వైపు వెళ్తున్న సమయంలో బుధవారం రాత్రి వేంపల్లి గ్రామం వద్ద ఊహించని విధంగా రోడ్డు ప్రమాదం సంభవించింది.ఆ ప్రమాదంలో గుర్తు తెలియని వాహనం ఒక మహిళను ఢీ కొట్టి ప్రమాదం చేసి వెళ్లినట్టుగా అక్కడి ఆనవాళ్లు బట్టి తెలిసింది.ఆ సదరు మహిళా రోడ్డుపై పడి ఉండటం గమనించిన మంచిర్యాల డిసిపి భాస్కర్ పోలీసు అధికారి తక్షణమే ఆయన యొక్క పోలీసు వాహనం ఆపినారు.అటుపిమ్మట మంచిర్యాల ప్రభుత్వ హాస్పిటల్ కు స్వయంగా దగ్గర ఉండి ఆ బాధిత మహిళను ఆటోలో ఎక్కించి పంపించారు.ఆ తరుణంలో డీసీపీ స్పందించిన గొప్ప తీరును స్థానిక వాహనదారులు,ప్రజలు హార్షం వ్యక్తం చేశారు.
ఒక దశలో అభినందనలు తెలిపారు.
Comments
Post a Comment