ఆర్కేపిలో వన్ నేషన్ --వన్ ఎలక్షన్ పై బిజెపి వర్క్ షాప్

ఆర్కేపిలో వన్ నేషన్ --వన్ ఎలక్షన్ పై బిజెపి వర్క్ షాప్



 

--  ముఖ్యఅతిథి బిజెపి జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర గౌడ్

మంచిర్యాల జిల్లాలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల బిజెపి పార్టీ కార్యాలయంలో శుక్రవారం వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై వర్క్ షాప్ ఎట్టకేలకు నిర్వహించారు.ఆ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర గౌడ్ హాజరైనారు.ఆ ప్రోగ్రాంకు ముందుగా పట్టణంలో సూపర్ బజార్ చౌరస్తాలో టపాకాయలు పేల్చి భాజాపా శ్రేణులు ముఖ్యఅతిథికి స్వాగతం పలికారు.అనంతరం బిజెపి ఆఫీసు చేరుకొని అక్కడి ఆఫీసులో వన్ నేషన్--వన్ ఎలక్షన్ పై వర్క్ షాప్ నిర్వహించారు.ఆ సందర్భంగా ముఖ్యఅతిథి వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ...వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై అక్కడి వర్క్ షాప్ లో అందరికీ అవగాహన కల్పించారు.అదేవిధంగా క్యాతనపల్లి మున్సిపాలిటీ రైల్వే  ఫ్లై ఓవర్ బ్రిడ్జి ప్రారంభోత్సవ జాప్యం ఇంకా నిర్లక్ష్యంపై పాలకుల పనితీరుపై ఆయన విమర్శల వర్షం కురిపించారు.ఆ సందర్భంగా భాజపా పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయనకు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.ఆ కార్యక్రమంలో బిజెపి రామకృష్ణాపూర్ పట్టణ అధ్యక్షులు ఠాకూర్ ధన్ సింగ్ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర గౌడ్,జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్,ఆరుముళ్ళ పోశం,రాపర్తి వెంకన్న,మోట పలుకుల తిరుపతి,బంగారు వేణుగోపాల్, అశోక్ వేముల,పిట్టల రమేష్,కట్ట ఈశ్వర చారి, వైద్య శ్రీనివాస్,ముద్దసాని శ్రీనివాస్,కళాధర్ రెడ్డి,శెట్టి రమేష్,తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి