జర్నలిస్టు ముసుగులో నకిలీలను గుడ్డలూడదీసి ఊరేగిస్తా..

జర్నలిస్టు ముసుగులో నకిలీలను గుడ్డలూడదీసి ఊరేగిస్తా..  



--  జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్

హైదరాబాద్ న్యూస్ మార్చి-15, జర్నలిస్టు తెలుగు దినపత్రిక :సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెడితే చూస్తూ..ఊరుకోనని శనివారం సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.ఆ క్రమంలో చూస్తే..ప్రజా జీవితంలో ఉన్నందున ఓపిక పడుతున్నానని ఆయన అన్నారు.ఆ పెయిడ్ ఆర్టిస్టులతో తిట్టించి సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెడతారని ఆయన హెచ్చరించారు.ఎవరి పడితే వాళ్ళు ఛానల్ పెట్టుకుని ఇష్టాను రాజ్యాంగ మాట్లాడితే వాళ్లు జర్నలిస్టులు అవుతారా? అని ఆయన ప్రశ్నించారు.సోషల్ మీడియాలో హద్దు మీరుతున్న వారిని బట్టలూడదీసి రోడ్లమీద తిప్పిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,హెచ్చరిచారు.జర్నలిస్టు రేవతి,అరెస్టు విషయంలో బీఆర్ఎస్ వైఖరిపై సీఎం మండిపడ్డారు.ఇవాళ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు.కొందరు పెయిడ్ ఆర్టిస్టులను తెచ్చి పార్టీ ఆఫీస్ లోనే పెట్టి వీడియోలు రికార్డు చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్టు పెటితే వాటిపై పోలీసులు కేసు పెట్టి ఇద్దర్ని అరెస్టు చేశారు.దానికి  బీఆర్ఎస్ నేతలకు దుఃఖం వస్తుంది.సోషల్ మీడియాలో వాళ్లు పెట్టిన భాష ఓక సారి వినండి.జర్నలిస్టుల ముసుగులో మమ్మల్నీ మా ఇంట్లోని మహిళలపై ఇష్టారీతిలో తిట్టిస్తున్నారని బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు.ఆ భాష వింటే రక్తం మరుగుతుంది.కుటుంబ సభ్యులను అం తేసి మాటలు అంటుంటే మీరసలు మనుషులేనా? మీకు భార్యా బిడ్డలు, తల్లిదండ్రులు లేరా? మీ అమ్మనో, మీ చెల్లినో, మీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే మీరు వింటారా? అని ప్రశ్నించారు. నా భార్య,బిడ్డను తిటుతుంటే నాకు నొప్పి అవుతుంది.కానీ ఓక ఆడబిడ్డను అవమానిస్తుంటే మీకు నొప్పికాదా? ఏ సంస్కృతిలో ఉన్నారు.ముఖ్య మంత్రిగా చెబుతున్నా..ఒక్కొక్కరి తోడ్కలు తీస్తా...రాజకీయ జీవితంలో ఉన్నది మేము మమ్మల్ని విమర్శించండి.మా పని తీరుపై ప్రశ్నించండి అన్నారు..ఆ రకమైన భాషను ఆడపిల్లలే రికార్డు చేయించి తమ ప్లాట్ ఫామ్ లపై పోస్టులు చేస్తే ఇది మంచి పద్దతా  అని నిలదీశారు.అలాంటి వారు కోర్టులకు వెళ్లి బెయిల్ తెచ్చుకుం టామనుకుంటున్నారేమో అవసరం అయితే చట్టాన్ని సవరిస్తామన్నారు.వాటిని క్షమించే ప్రసక్తే లేదని, ఉక్కుపాతరేస్తామని హెచ్చరించారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి