ఆర్కేపిలో భక్తిశ్రద్ధలతో రంజాన్ పండుగ వేడుకలు - ఎమ్మెల్యే జి.వివేక్ ప్రార్ధనలు
ఆర్కేపిలో భక్తిశ్రద్ధలతో రంజాన్ పండుగ వేడుకలు - ఎమ్మెల్యే జి.వివేక్ ప్రార్ధనలు
-- షవ్వల్ నెలవంకతో
ఉపవాసం విరమించిన ముస్లిం సోదర్లు
-- జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్....
రామకృష్ణాపూర్ న్యూస్ మార్చి-31 జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్ : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల పాత పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఈద్గా వద్ద పట్టణ ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో సోమవారం రంజాన్ పండుగ వేడుకలు పెద్ద ఎత్తున జరుపుకున్నారు.ఆ క్రమంలో చూస్తే..రామకృష్ణాపూర్ ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ ఈద్గా కమిటీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో అక్కడి ఈద్గా నందు ముస్లిం సోదరులు నమాజ్ ఆచరించుట కొరకు ఏర్పాట్లు చేసారు.మదీనా మస్జీద్ ఇమామ్ రంజాన్ పండుగ విశిష్టత తెలియచేసి,ఈద్ -ఉల్ -ఫితర్ ఈద్ నమాజ్ బిలాల్ మస్జీద్ ఇమామ్ అబ్దుల్ అజీజ్ నమాజ్ చదివించి ప్రత్యేక ప్రార్ధన చేసారు.అదే విదంగా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆదేశానుసారం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ బోర్డు బిల్ కు వ్యతిరేకంగా ఇక్కడి నమాజ్ కు వచ్చిన ముస్లిం సోదరులందరూ కుడి చేతికి నల్ల రిబ్బన్ ధరించి వాళ్ల యొక్కనిరసనలు తెలిపారు.కాగా రంజాన్ పండుగ వేడుకలకు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ముఖ్యఅతిథిగా హాజరైనారు.దాంతో ఎమ్మెల్యే మాట్లాడుతూ...ముస్లింల అభివృద్ధి కోసం చెన్నూరు నియోజకవర్గంలో కోటి ఆరు లక్షల నిధులతో అభివృద్ధి పనులు ప్రారంభించడం జరిగిందని తెలిపారు.రానున్న కాలంలో ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డు రద్దు కోసం తన కుమారుడు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ కూడా పార్లమెంట్లో మాట్లాడడం జరిగిందని గుర్తు చేసారు.ఆ సమయంలో ముస్లిం సోదరులందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఆ కార్యక్రమంలో ముస్లిం సోదరులు అన్ని మస్జీద్ ల సదర్ కమిటీ సభ్యులు ఈద్గా కమిటీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్,అక్బర్ అలీ,ఆరీఫ్,యాకుబ్ అలీ,డాక్టర్ సలీమ్,ఇమ్రాన్,తహర్,గౌస్,మేరజ్,ఖాజా,అబ్బాస్,తాజ్,అఫ్జల్,ముస్లిం సోదరులు,తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment