క్యాతనపల్లి రైల్వే గేటు ఓపెన్ చేసిన అధికారులు
క్యాతనపల్లి రైల్వే గేటు ఓపెన్ చేసిన అధికారులు
-- జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్...
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల క్యాతనపల్లి రైల్వే గేటును శుక్రవారం రైల్వే అధికారులు ఎట్టకేలకు ఓపెన్ చేశారు.ఆ క్రమంలో చూస్తే..గత రెండు రోజుల క్రితం మూసివేసిన ఆ రైల్వే గేటు ఈ నెల 28 తేదీ వరకు మూసి ఉంటుందని ఆ సెంట్రల్ రైల్వే అధికారులు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే.ప్రధానంగా రైల్వే గేటు మూసివేతతో పదవ తరగతి పరీక్షలు వ్రాసే విద్యార్థిని,విద్యార్థులకు చాలావరకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకొని పదవ తరగతి పరీక్షలు దృష్టిలో పెట్టుకొని క్యాతనపల్లి రైల్వే గేటును ఓపెన్ చేయాలని కేంద్ర రైల్వే అధికారులు నోటీసు పంపించినట్లు తెలిసింది.ఆ నేపథ్యంలోనే ద్విచక్ర వాహనదారులు నాలుగు చక్ర వాహనదారులు ఆటోలు ఇంకా వాహనాలన్నీ కూడా గతంలో మాదిరిగానే క్యాతనపల్లి రైల్వే గేట్ నుంచి వెళ్లడం రావడం క్రమంగా జరుగుతుంది.క్యాతనపల్లి రైల్వే గేటు ఓపెన్ చేసిన విషయంను అందరు కూడా గమనించాలని జర్నలిస్టు పేపర్ అండ్ మీడియా న్యూస్ ద్వారా తెలుపుతున్నాము.
Comments
Post a Comment