రంజాన్ పండుగతో ఇఫ్తార్ విందులో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్
రంజాన్ పండుగతో ఇఫ్తార్ విందులో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్
- ముస్లిం సోదరి,సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు
రామకృష్ణాపూర్ న్యూస్ మార్చి-23 జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్ : చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల ఏ-జోన్ ప్రాంతంలోని బిలాల్ మసీదులో ఆర్కే-ఒకటి లో గల మసీదులో ఆదివారం సాయంత్రం ఇఫ్తార్ విందులో హాజరైనారు.ఆ సందర్భంగా చెన్నూరు అసెంబ్లీ శాసనసభ్యులు డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడారు.ఆ నేపథ్యంలోనే ముస్లిం సోదరీ,సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ముస్లిం సోదరులు అందరితో కలిసి ఎమ్మెల్యే వివేక్ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.ఆ కార్యక్రమంలో ఆర్ కే పి ముస్లిం వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు ఎండి.అబ్దుల్ అజీజ్,సిటీ కేబుల్ సలీం,మైనార్టీ సెల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లాడెన్,ఎండి.పాషా,పిసిసి సెక్రటరీ రఘునాథరెడ్డి,కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పల్లెరాజు,సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య,ముస్లింలకు చెందిన మత గురువులు,ముస్లిం సోదరులు,తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment