ఏప్రిల్-3న సిఎం రేవంత్ రెడ్డి..మంత్రివర్గ విస్తరణ?

 ఏప్రిల్-3న సిఎం రేవంత్ రెడ్డి..మంత్రివర్గ విస్తరణ?


-  రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఏఐసీసీ ఆమోదం

హైదరాబాద్ న్యూస్ మార్చి-26 జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్ : తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ దిశగా వేగంగా సాగుతుంది.ఆ క్రమంలో చూస్తే...రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువు దీరి దాదాపు యేడాదిన్నర కావస్తోంది.2023 డిసెంబర్‌లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్‌ రెడ్డితో పాటు మరో 11 మంది మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు.దాంతో మంత్రి వర్గ విస్తరణ ఇప్పటివరకూ జరగలేదు.తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఏఐసీసీ పచ్చజెండా ఊపింది.ఆ నేపథ్యంలోనే ఏప్రిల్‌ 3న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉంది.అయితే ఇద్దరు బీసీలు,రెడ్డి,ఎస్సీకి తెలంగాణలోని మంత్రివర్గంలో చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది.కాగా రాష్ట్ర కోర్‌ కమిటీ నుంచి ఏఐసీసీ వివరాలు తీసుకుంది.ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి,పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ నుంచి అభిప్రాయాలు సేకరించింది.ఆ తరుణంలో రేవంత్ వద్దే కీలక శాఖలు హోం,మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌,అర్బన్‌ డెవలప్‌మెంట్‌,విద్య,జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ వంటి కీలక శాఖలను రేవంత్‌ రెడ్డి తన దగ్గరే పెట్టుకున్నారు. అయితే మరో ఆరుగురిని మంత్రులుగా నియమించే అవకాశం ఉండగా ఇప్పటి వరకు కాంగ్రెస్‌ ఆ దిశగా అడుగులు వేయలేదు.ప్రధానంగా ఇప్పుడు తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ జరగనుంది.ఉగాది తర్వాత ఒకటి రెండ్రోజుల్లోనే కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం ఉం టుందని చెబుతున్నారు.కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి,గ‌డ్డం వివేక్‌తో పాటు పార్లమెంట్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం వాకిట శ్రీహ‌రి ముదిరాజ్‌కు బెర్తులు క‌న్ఫామ్ అయ్యాయని తెలిసింది.బీసీ కోటాలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ పేర్లు వినిపిస్తున్నాయి.అలాగే ఎస్సీ కోటాలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట్ స్వామికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది.రెడ్డి కోటాలో..మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేసులో ఉండగా..బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కూడా పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది.ఎమ్మెల్సీలు మీర్ అమీర్ అలీఖాన్‌,విజయశాంతి పేర్లు కూడా వినిపిస్తున్నాయి.ఉమ్మడి న‌ల్లగొండ జిల్లా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐల‌య్యకు కూడా అవకాశం దక్కుతుందని సమాచారం గుండా తెలుస్తుంది.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి