ఉమ్మడి అదిలాబాద్ జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు ముగిసాయి
ఉమ్మడి అదిలాబాద్ జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు ముగిసాయి
మంచిర్యాల న్యూస్,జూన్-9,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హైటెక్ సిటీ లో గల మంచిర్యాల క్లబ్ లో స్టార్ మంచిర్యాల జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు గాజుల ముఖేష్ గౌడ్,ప్రధాన కార్యదర్శి పుల్లూరి సుధాకర్ ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు సోమవారంతో ఎట్టకేలకు ముగిశాయి.ఆ క్రమంలో చూస్తే.. క్రీడాపోటీల అనంతరం బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్వరూప హాస్పిటల్స్ డాక్టర్ శరత్ బాబు హాజరయ్యారు.అతిథులుగా మంచిర్యాల క్లబ్ ట్రెజరర్ పురుషోత్తం జాజు, ఎస్ టి పి పి డి జి యం పంతుల, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ స్పోర్ట్స్ ఆఫీసర్ బండ మీనా రెడ్డి లు హాజరైనారు.అనంతరం విన్నర్స్, రన్నర్స్ కు మెడల్స్ అందజేశారు.ఆ సందర్భంగా డాక్టర్ శరత్ బాబు మాట్లాడుతూ.. క్రీడలను ప్రోత్సహించడానికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు గాజుల ముఖేష్ గౌడ్ మాట్లాడుతూ..జిల్లా స్థాయి చాంపియన్షిప్ పోటీలకు హాజరైన క్రీడాకారులందరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు.విన్నర్స్, రన్నర్స్, పాల్గొన్న క్రీడాకారులు అందరు కూడా జిల్లా స్థాయిలోనే కాకుండా జాతీయ,అంతర్జాతీయ స్థాయిలలో రాణించాలని సూచించారు. జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేస్తుందని తెలిపారు.అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పుల్లూరి సుధాకర్ మాట్లాడుతూ..విన్నర్స్, రన్నర్స్ గా నిలిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు పంపించడం జరుగుతుందని తెలిపారు.జిల్లా ఛాంపియన్షిప్ పోటీలకు సహాయ సహకారాలు అందజేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.ఆ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ,కృష్ణ,మధు,రవి,గోపాల్,రవికుమార్,నందం శ్రీనివాస్,శ్రీనివాస్ రెడ్డి,రాజు,కబీర్ దాస్,కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
----బ్యాడ్మింటన్ పోటీల విజేతలు వీరే .....
అండర్ 11 బాలికల సింగిల్స్ లో శ్రీహ కందికట్ల, త్విష ఉప్పల, అండర్ 11 బాలుర విభాగంలో శరవరన్, అర్జున్, అండర్ 11 బాలికల డబుల్స్ లో త్విష, శ్రీహ, హర్షిత, మినీ, బాలుర డబుల్స్ లో అర్జున్, అమన్, అరుష్, శశిధర్, అండర్ 13 బాలికల సింగిల్స్ లో ఏ ఆరాధ్య, కే సహస్ర, అండర్ 13 బాలురలో శ్రీ హర్షిత్, సుహిత్, బాలుర డబుల్స్ లో సుహిత్, అక్షిత్, గౌతమ్, సాత్విక్, అండర్ 15 బాలికల సింగిల్స్ లో ఏ ఆరాధ్య, ఈ విన్షు శ్రీ, బాలుర సింగిల్స్ లో ధనుష్, జస్వంత్, బాలికల డబల్స్ లో ఆరాధ్య, విన్షు శ్రీ, సహస్ర శ్రీ, ప్రతిభ, బాలుర డబల్స్ లో గౌతమ్, రానా, సుహాస్, హర్షిత్, మిక్స్ డబుల్స్ లో గౌతమ్,హంషిత, ఆరాధ్య, శ్రీ హర్షిత్, అండర్ 17 బాలుర సింగిల్స్ లో ధనుష్, రిజ్వాన్, బాలికల సింగిల్స్ లో జి అనన్య, కే సహస్ర, బాలుర డబుల్స్ లో ఆర్ బన్నీ,బి అఖిల్, గౌతమ్,గుణ, అండర్ 19 బాలుర సింగిల్స్ లో జి రాము, బి ఆదిత్య హర్షవర్ధన్,బాలికల సింగిల్స్ లో జి అనన్య, బాలుర డబల్స్ లో పి ఆకాష్, విష్ణు నారాయణ, జి రితిన్, రుద్ర ప్రతాప్, మెన్ సింగిల్స్ లో బి ఆదిత్య హర్షవర్ధన్, భీమ్ రావు, మెన్ డబల్స్ లో సాయికుమార్, భీమ్ రావు, సాయి, రిజ్వాన్, ఉమెన్ సింగిల్స్ లో జి.ఆరాధ్య, రిస్లీనాలు ఉన్నారు.
Comments
Post a Comment