తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వివేక్ కు ఆర్కేపీ కాంగ్రెస్ శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన గడ్డం వివేక్ వెంకట స్వామికి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు.ఆ క్రమంలో చూస్తే..తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామిని హైదరాబాదులో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్ర మంత్రి వివేక్ కు శుభాకాంక్షలు తెలిపారు.ఆ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆర్కేపీ అధ్యక్షుడు పల్లె రాజు,క్యాతనపల్లి పుర:మాజీ వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి,మాజీ కౌన్సిలర్ పనాస రాజు,సీనియర్ నాయకులు ఎండి.అబ్దుల్ అజీజ్,గాండ్ల సమ్మయ్య,గోపు రాజం,కట్ల రమేష్, బొద్దుల ప్రేమ్ సాగర్ లు,తదితరులు ఉన్నారు.ఆ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ..ఆర్కేపీ పట్టణంలో నెలకొన్న అనేక సమస్యలు,అభివృద్ధి పనులు,ఇంకా ప్రభుత్వ పథకాలపై ఆ పార్టీ నాయకులతో సుదీర్ఘంగా చర్చించారు.
Comments
Post a Comment