ఆర్కేపిలో పర్యటించిన కార్మిక,మైనింగ్ శాఖ మంత్రి వివేక్ కు ఘనంగా స్వాగతం
ఆర్కేపిలో పర్యటించిన కార్మిక,మైనింగ్ శాఖ మంత్రి వివేక్ కు ఘనంగా స్వాగతం
ఏరియా ఆసుపత్రి వద్ద సింగరేణి కార్మికుని విగ్రహం ఆవిష్కరణ
పట్టణంలో భారీ ఎత్తున మోటార్ సైకిల్ ర్యాలీ
అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు ఘనంగా నివాళులు
మంత్రిగా ఎక్కువ నిధులు తీసుకువచ్చి రామకృష్ణాపూర్ అభివృద్ధికి మరింత ఎక్కువగా కృషి చేస్తానని మంత్రి ప్రసంగం...
-- జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్...
రామకృష్ణాపూర్ న్యూస్,జూన్-14,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పట్టణంలో నూతన రాష్ట్ర కార్మిక,మైనింగ్ శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి శనివారం సాయంత్రం పర్యటించారు.ఆ క్రమంలో చూస్తే..పట్టణంలోని సింగరేణి ఏరియా ఆసుపత్రి వద్ద మంత్రికి కాంగ్రెస్ శ్రేణులు స్థానిక ప్రజలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.ఆ సందర్భంగా రెండు క్రేన్ వాహనంల ద్వారా డిజె సాంగ్స్ ఇంకా బ్యాండ్ మేళాల మధ్య భారీ ఎత్తున గజ పూలమాలను మంత్రికి సమర్పించారు.అలాగే పుష్పగుచ్చాలు ఇచ్చి శాలువాలు కప్పి సంతోషంగా మంత్రికి ఆహ్వానం పలికారు.అనంతరం ఏరియా ఆసుపత్రి వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన సింగరేణి కార్మికుని విగ్రహమును మంత్రి ఆవిష్కరించారు. అటు తర్వాత పట్టణంలోని పుర:వీధుల చేపట్టిన భారీ ఎత్తున మోటార్ సైకిల్ ర్యాలీతో శ్రీ కోదండ రామాలయం చౌరస్తాలోని అమరవీరుల స్థూపం వద్ద గల తెలంగాణ అమరవీరులకు ఘనంగా ఆయన నివాళులర్పించారు.అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి వివేక్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రామకృష్ణాపూర్ లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు గుర్తు చేశారు.ముఖ్యంగా క్యాతనపల్లి రైల్వే యొక్క ఫ్లై ఓవర్ బ్రిడ్జిని చాలా శ్రద్ధ పెట్టి ఆ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించినట్లు తెలిపారు.తాను ఎంపీగా ఉన్నప్పుడు ఆ బ్రిడ్జికి శంకుస్థాపన చేసినట్లు మళ్లీ తానే ఎమ్మెల్యేగా అయిన తర్వాత సంబంధిత రైల్వే బ్రిడ్జిని పూర్తి చేసినట్లు తెలిపారు.అంతేకాకుండా పట్టణంలో స్మశాన వాటిక ఏర్పాటుకు కూడా సింగరేణి యాజమాన్యం యొక్క చైర్మన్ తో మాట్లాడటంతో పాటు తగిన ఏర్పాట్లు కూడా చేసినట్లు పేర్కొన్నారు.ఇంకా పట్టణంలో మురికి కాలువ డ్రైనేజీ రోడ్ల నిర్మాణంతో పాటు ప్రతి ఇంటికి నల్ల ఉండే విధంగా కృషి చేస్తామన్నారు.పేదలకు అందరికీ విద్యా వైద్యం అందించే విధంగా కాంగ్రెస్ ప్రజా పాలన రేవంత్ రెడ్డి హయాంలో పరిపాలన కొనసాగుతుందని వెల్లడించారు.సింగరేణి ప్రాంతంలో పెండింగ్ లో ఉన్న 76 జీవో యొక్క పట్టా భూములను కూడా అందరికీ వచ్చే విధంగా కృషి చేస్తున్నట్లు ప్రసంగించారు.ఎమ్మెల్యేగానే కాకుండా మంత్రిగా కూడా తాను అయిన దృష్ట్యా మరింత ఎక్కువ నిధులు తీసుకురావడమే కాకుండా చెన్నూరు నియోజకవర్గంతో పాటు క్యాతనపల్లి మున్సిపాలిటీ రామకృష్ణాపూర్ పట్టణాభివృద్ధికి 100 శాతం అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.దానికి అన్ని వర్గాల ప్రజలు అందరు కూడా కూడా తప్పకుండా పూర్తి మద్దతూ తెలిపాలని ఇంకా సపోర్ట్ చేయాలని కోరారు.బిఆర్ఎస్ పార్టీ హయాంలో అందరిపై పోలీసు కేసులు పెట్టినట్టు గుర్తు చేశారు.కాంగ్రెస్ పాలనలో అలాంటి పోలీస్ కేసులు లేకుండా ప్రజా పాలనలో ప్రజల కోసం మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని తెలిపారు.
అనంతరం పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డులకు చెందిన కాంగ్రెస్ కమిటీ సభ్యులు అలాగే వివిధ కుల సంఘం సభ్యులు ఇతర సంఘాల కమిటీ సభ్యులు మంత్రికి శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు.ఆ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బి వెంకట్రావు,ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షుడు వి సీతారామయ్య,స్థానిక కాంగ్రెస్ నాయకులు పల్లె రాజు పి రఘునాథ్ రెడ్డి మాజీ క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్ పర్సన్ జంగం కల వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి,ముఖ్య నాయకులు అబ్దుల్ అజీజ్ గాండ్ల సమ్మయ్య ఓడ్నాల శ్రీనివాస్ డి కొండ శ్యామ్ గౌడ్ మాజీ కౌన్సిలర్లు స్థానిక కాంగ్రెస్ నాయకులు యూత్ నాయకులు మహిళ నాయకురాలు పట్టణ ప్రజలు సింగరేణి కార్మికులు మాజీ కార్మికులు పార్టీ కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలోపాల్గొన్నారు.ఆ నేపథ్యంలోనే మంత్రి పర్యటనలో భాగంగా మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో మందమర్రి ఎస్సై రాజశేఖర్ రామకృష్ణాపూర్ ఎస్సై రాజశేఖర్ ఇంకా పోలీసుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
Comments
Post a Comment