అంతర్జాతీయ యోగా దినోత్సవంతో ఆర్కేపి ఏరియా ఆసుపత్రిలో యోగ





అంతర్జాతీయ యోగా దినోత్సవంతో ఆర్కేపి ఏరియా ఆసుపత్రిలో యోగ 

ఈ నెల 21న-11వ అంతర్జాతీయ దినోత్సవ వేడుకలు 

సింగరేణి వ్యాప్తంగా ఈ నెల 16 నుంచి 21 వరకు యోగ ప్రోగ్రాంలు

జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్...

రామకృష్ణాపూర్ న్యూస్,జూన్-18,జర్నలిస్టు తెలుగు దినపత్రిక : సింగరేణి కాలరీస్లోని మందమర్రి డివిజన్ పరిధిలో గల రామకృష్ణాపూర్ పట్టణంలోని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో బుధవారం ఉదయం యోగ టీచర్ శైలజ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం అత్యంత శ్రద్ధతో చక్కగా నిర్వహించారు.సింగరేణి వ్యాప్తంగా చేపడుతున్న సంబంధిత కార్యక్రమాలలో భాగంగా 11వ అంతర్జాతీయ దినోత్సవ యొక్క వేడుకలు ఈనెల 21న నిర్వహిస్తారు.దాంతో ఈనెల 16 నుంచి 21 తేదీ వరకు ఈ యోగా వేడుకలు చేపడుతున్నారు.కాగా ఏరియా ఆసుపత్రిలో చేపట్టిన యోగాలో ఆస్పత్రి ఉద్యోగ సిబ్బంది అందరూ కూడా కలిసి యోగా విన్యాసాలు చేశారు.ఈ కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి డివైసిఎమ్ఓ ప్రసన్నకుమార్,సంక్షేమ అధికారి,డాక్టర్లు,నర్సులు,వార్డు బాయిలు,ఉద్యోగ సిబ్బంది అందరూ






పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి