కాలేశ్వరంపై కేసిఆర్ కమిషన్ విచారణ ముగిసింది

కేసిఆర్ కమిషన్ విచారణ ముగిసింది



-- జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్...

హైదరాబాదు న్యూస్,జూన్-11,హైదరాబాద్ :బి ఆర్కే భవన్ లో కాలేశ్వరం ప్రాజెక్టు కమిషన్ ఎదుట బుధవారం మాజీ సీఎం బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ విచారణ ముగిసింది.ఆయనను పీసి ఘోష్,50 నిమిషాలుపాటు విచారించింది.ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అనేక ప్రశ్నలు సంధించిన115వ సాక్షిగా ఆయన్ను విచారించింది.ఉదయం ప్రారంభమైన ఈ విచారణ సుమారు 50 నిమిషాల పాటు కొనసా గింది.ఆ సమయంలో కేసీఆర్ పలు కీలక అంశాలపై వివరణ ఇచ్చారు.ఆ విచారణ సందర్భంగా తాగునీరు,సాగునీటి సమస్యలు,వాటి పరిష్కారానికి తాను తీసుకున్న నిర్ణయాలు అలాగే భారత దేశంలో నీటి లభ్యత,విని యోగం వంటి అంశాలపై కూడా సమగ్రమైన వివరాలు కేసీఆర్ అందించారని సమాచారం.అంతేగాక చాలావరకు డాక్యు మెంట్లు కూడా కమిషన్‌కు ఆయన సమర్పించారు.ఆ విచారణ అనంతరం కేసీఆర్ జస్టిస్ ఘోష్ కార్యాలయానికి వెళ్లి..నేటి విచారణలో ఇచ్చిన సమాధానాలను పరిశీలించి వాటిపై సంతకాలు చేసారు.ఆ విచారణలో వన్ టూ వన్ విధానాన్ని అనుసరించడంపై కొన్ని విమర్శలు వచ్చినా, కమిషన్ వర్గాలు దానిపై స్పందించాయి.కేసీఆర్ ఆరోగ్యం పూర్తి స్థాయిలో బాగోలేకపోవడంతో ఆయన విజ్ఞప్తి మేరకు చట్టరీత్యా వన్ టూ వన్ విచారణ జరిపినట్లు స్పష్టం చేశాయి. కాగా సంబంధిత విచారణ ముగిసిన తర్వాత కేసీఆర్ సోమజిగూడా యశోద ఆసుపత్రికి చేరుకున్నారు.అక్కడ ఆసుపత్రిలో చేరిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిను పరామర్శించారు.నేడు ఉదయం ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో ఆయన జారిపడడంతో ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి