జర్నలిస్టు టీవీ వార్తకు స్పందన..క్యాతనపల్లి రైల్వే బ్రిడ్జిపై స్పీడ్ బ్రేకర్లు వేశారు
జర్నలిస్టు టీవీ వార్తకు స్పందన..క్యాతనపల్లి రైల్వే బ్రిడ్జిపై స్పీడ్ బ్రేకర్లు వేశారు
జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్
రామకృష్ణాపూర్ న్యూస్,జూన్-23,జర్నలిస్టు తెలుగు దినపత్రిక న్యూస్ : మంచిర్యాల జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలో ఆనుకొని ఉన్న రామకృష్ణాపూర్ పట్టణంలో గల క్యాతనపల్లి రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై సోమవారం స్పీడ్ బ్రేకర్లు వేశారు.ఆ క్రమంలో చూస్తే..క్యాతనపల్లి రైల్వే బ్రిడ్జి ఇటీవల కాలంలోనే ప్రారంభించారు.ప్రధానంగా చూస్తే...క్యాతనపల్లి రైల్వే బ్రిడ్జి స్టార్టింగ్ అండ్ ఎండింగ్ స్థలంలో రోడ్డు క్రాస్ ఎక్కువగా ఉండటంతో పాటు డౌన్ ఎక్కువగా ఉండటం చేత రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని మంచిర్యాల కలెక్టర్తో పాటుగా ఆర్ అండ్ బి అధికారుల దృష్టికి జర్నలిస్టు టీవీ పత్రిక తీసుకువెళ్లడం జరిగింది.దాంతో వెంటనే స్పందించిన సంబంధిత అధికారులు వెంటనే క్యాతనపల్లి రైల్వే బ్రిడ్జి రోడ్డుకు ఇరువైపులా ప్రమాద హెచ్చరిక బోర్డులు అమర్చారు.ఆ తర్వాత మళ్లీ జర్నలిస్టు తెలుగు దినపత్రిక ఛానల్ తప్పకుండా రోడ్డుపై స్పీడ్ బ్రేకర్లు వేయాలి ఇంకా వెంటనే బ్రిడ్జిపై స్ట్రీట్ లైట్లు కూడా పెట్టాలని మరొకసారి వార్త ద్వారా అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది.దీంతో వెంటనే మరోసారి స్పందించిన అధికారులు రైల్వే బ్రిడ్జిపై రోడ్డును అనుసరించి స్పీడ్ బ్రేకర్లు వేశారు.అలాగే రోడ్డు మధ్యలో రోడ్డుకు రెండు వైపులా రోడ్డు ప్రమాదాలు జరగకుండా గీతలు కూడా ఏర్పాటు చేశారు.అంతేకాకుండా చీకటి సమయంలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా రోడ్డుపై లైటింగ్ స్టిక్కర్లను ఏర్పాటు చేస్తారు.ఇంకా మిగిలిన రోడ్డుకు రెండు వైపులా క్యాతనపల్లి రైల్వే బ్రిడ్జిపై వీధి దీపాలు స్ట్రీట్ లైట్లు
కూడా త్వరగా ఏర్పాటు చేయాలని ప్రజల యొక్క మనోభావాలను జర్నలిస్టు టీవీ అండ్ పత్రిక ద్వారా గుర్తు చేస్తున్నాము.
Comments
Post a Comment