ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?
ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుడు ఆత్మహత్య - ఎస్ఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు రామకృష్ణాపూర్ న్యూస్,సెప్టెంబరు-3, జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ :మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల బి-జూన్ లోని శ్రీనివాస నగర్(క్యాతనపల్లి మున్సిపాలిటీ 17వార్డు)కు చెందిన కుషనపెల్లి నవీన్(33)అనే యువకుడు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న గోర విషాద ఘటన బుధవారం చోటుచేసుకుంది.ఆ క్రమంలో చూస్తే..పట్టణంలోని ఒక ప్రైవేటు స్కూల్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా మృతుడు విధులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.కాగా ఆ మృతునికి భార్య ఇద్దరు కుమారులు తండ్రి ఉన్నారు.ఆ మేరకు స్థానిక ఎస్సై రాజశేఖర్ పోలీస్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు.అయితే ఫ్రెండ్స్ కు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలని ఆత్మహత్యకు ముందు రెండు పేజీల లేఖ కూడా ఆ మృతి చెందిన యువకుడు వ్రాసినవి అక్కడ స్థలంలో లభ్యమయ్యాయి.నవీన్ ఆత్మహత్యకు గల అసలు కారణాలు పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Comments
Post a Comment