విమానం దారుణంగా కుప్ప కూలింది- ఆ విమానంలో 242 ప్రయాణికులు



విమానం కుప్ప కూలింది- ఆ విమానంలో 242 ప్రయాణికులు ఉన్నారు.

టేకాఫ్ సమయంలోనే పరిస్థితి చేయి దాటింది- క్షణాల్లో భస్మీపటలం: పైలెట్ నుంచి చివరి సందేశం ఇదే..

-   జర్నలిస్టు తెలుగు దినపత్రిక- టీవీ న్యూస్..

అహ్మదాబాద్ లో దిగ్బ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఓక విమానం కుప్పకూలింది. అది- ఎయిరిండియాకు చెందిన విమానంగా ప్రాథమిక సమాచారం అందుతోంది.ప్రమాదానికి గురైన సమయంలో ఆ విమానంలో 242 మంది ప్రయాణికులు,సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది.అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఎయిర్ పోర్ట్ సమీపంలో ఉన్న మెఘానీ నగర్, షాహిబాగ్ వద్ద కుప్పకూలింది.ఎయిర్ పోర్ట్ సమీపంలో ఉన్న మెఘానీ నగర్, షాహిబాగ్ వద్ద కుప్పకూలింది.ఆ సమాచారం అందిన వెంటనే రాష్ట్ర విపత్తు నిర్వహణ-అగ్నిమాపక సిబ్బంది, జాతీయ విపత్తు నిర్వహణ బలగాలు, పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. విమాన శకలాలు జనావాసాల మీద పడటం వల్ల మరణాల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమౌతోన్నాయి.అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన ఎయిరిండియాకు చెందిన ఏఐ 171 ఫ్లైట్ అది. గట్విక్ ఎయిర్ పోర్టుకు చేరాల్సి ఉంది.ఈ రోజు మధ్యాహ్నం 1:39 నిమిషాలకు టేకాఫ్ అయింది.రన్ వే నంబర్ 23ని వీడింది. ఆ కొద్ది సేపటికే కుప్పకూలింది. పెద్ద శబ్దం చేస్తూ.. నిప్పు కణికలా నేలకు రాలింది.ఆ వెంటనే దట్టమైన పొగ వెలువడింది.ఆ సంఘటన స్థలంలో మంటలు చెలరేగాయి.సంఘటన స్థలంలో భయానక వాతావరణం నెలకొంది.అగ్నిమాపక వాహనాలు,అంబులెన్సులు, పోలీసు వాహనాల సైరన్ మోతలతో ఆ ప్రాంతం అంతా మార్మోగిపోయింది. సహయక చర్యలు అందజేయడానికి సంఘటన స్థలానికి స్థానికులు పరుగులు తీశారు. అందుబాటులో ఉన్న వాహనాలను క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించడాని వినియోగించారు.ఈ ఘోర దుర్ఘటన పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వెంటనే గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కు ఫోన్ కాల్ చేశారు.ఈ ఘటన చోటు చేసుకోవడానికి గల కారణాలపై ఆరా తీశారు.సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందజేయాలని ఆదేశించారు.

ఫ్లైట్ టేకాఫ్ తీసుకుంటోన్న సమయంలోనే ప్రమాదాన్ని పసిగట్టారు పైలెట్లు.వెంటనే ఎయిర్ ట్రాఫిక్క కంట్రోల్ కు సమాచారం ఇచ్చారు. MAYDAY కాల్ చేశారు. అత్యంత తీవ్ర ఆందోళనకర పరిస్థితుల్లో మాత్రమే పైలెట్లు ఈ కాల్ చేస్తుంటారు. I need help అంటూ ఏటీసీకి సమాచారం ఇచ్చారు.అదే చివరిది...

ఆ తరువాత విమానంతో ఏటీసీకి సంబంధాలు తెగిపోయాయి. ఏటీసీ పదే పదే సమాచారాన్ని పంపించినప్పటికీ కాక్ పిట్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఆ వెంటనే భారీ శబ్దం రావడం, మంటలు చెలరేగడం, దట్టమైన పొగ వెలువడటంతో ఎయిర్ పోర్ట్ అధికారులను ఆందోళనకు గురి చేసింది.

*ఎయిర్ ఇండియా ప్రమాదంలో 110 మంది చనిపోయినట్లు ప్రాథమిక సమాచారం..*

ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 242 ప్రయాణికులు

వారిలో 169 మంది భారతీయులు

53 మంది బ్రిటీష్ జాతీయులు





7 మంది పోర్చుగీసు, ఒక కెనెడియన్ ఉన్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటన.


Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి