300 కోట్ల కుంభకోణంలో శ్రీలక్ష్మి శ్రీనివాస కన్‌స్ట్రక్షన్ యజమాని గుర్రం విజయలక్ష్మి అరెస్ట్ జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్

300 కోట్ల కుంభకోణంలో శ్రీలక్ష్మి శ్రీనివాస కన్‌స్ట్రక్షన్ యజమాని గుర్రం విజయలక్ష్మి అరెస్ట్


జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్


జనవరి 31 హైదరాబాద్ న్యూస్ దుండిగల్: గత ఏడేళ్లుగా జి ఎల్ సి విల్లా ప్రాజెక్టులో మోసపూరిత వ్యవహారాలకు పాల్పడి 400 కోట్ల కుంభకోణం చేసిన ఎన్ఆర్ఐ గుర్రం విజయలక్ష్మిని గురువారం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్‌కు తరలించారు. అలాంటి మోసాలకు అడ్డుకట్ట వేయాలంటే హెచ్ఎండిఏ, మున్సిపల్, గ్రామ పంచాయతీ అధికారులు అనుమతులు మంజూరు చేసే సమయంలో అవినీతి లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. బాధితులకు అన్యాయం జరుగకుండా ప్రమాదకర నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే అధికారులపై కూడా విచారణ జరపాలి అని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.కేవలం అరెస్ట్ కాదు, సహకరించిన అధికారులపై చర్యలు తప్పనిసరి

గుర్రం విజయలక్ష్మికి సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, పదవి నుండి తొలగించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.అవినీతి నిరోధక శాఖ (తెలంగాణ ఏసీబీ) చిన్న ఉద్యోగులపై కాకుండా అలాంటి భారీ మోసాలకు సహకరించిన అధికారులపై దృష్టి సారించాలని కోరుతున్నారు.మేడ్చల్‌ జిల్లా పరిపాలన వైఫల్యంపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కలెక్టర్ ఇద్దరు అదనపు కలెక్టర్లు ఉన్నా, ఈ విధంగా అక్రమాలు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. 

బహుదూర్‌పల్లి సర్వే నెం.227లో 353.35 ఎకరాల భూమి విషయంలో ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోనుందో అనే ప్రశ్నలు వస్తున్నాయి. 

ధరణి రిజిస్ట్రేషన్‌లు, బహిరంగ రిజిస్ట్రేషన్‌లు చేసిన అధికారులపై విచారణ జరిపించాలనే డిమాండ్‌ ప్రజల్లో మరింత ఎక్కువగా పెరుగుతోంది.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి