రోజూ పాల‌ను అస‌లు ఏ సమ‌యంలో తాగాలి..?

 

 Milk | రోజూ పాల‌ను అస‌లు ఏ సమ‌యంలో తాగాలి..?

 పాల‌లో మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే దాదాపు అన్ని పోష‌కాలు ఉంటాయి. ఒక్క విట‌మిన్ సి త‌ప్ప పాల‌లో అన్ని పోష‌కాలు ఉంటాయి. అందుక‌నే పాల‌ను సంపూర్ణ పౌష్టికాహారంగా పిలుస్తారు. ఈ క్ర‌మంలోనే రోజూ ఒక గ్లాస్ పాల‌ను తాగితే శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అన్నింటినీ పొంద‌వ‌చ్చ‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు. పాల‌ను రోజూ తాగ‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. పాల‌ను తాగితే అందులో ఉండ క్యాల్షియం మ‌న ఎముక‌లు, దంతాలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. పాల ద్వారా మ‌న‌కు స‌హ‌జ‌సిద్ధంగా క్యాల్షియం ల‌భిస్తుంది. ఇక ప్ర‌స్తుతం చాలా మంది విట‌మిన్ డి లోపం బారిన ప‌డుతున్నారు. అలాంటి వారు రోజూ పాల‌ను తాగితే ఈ విట‌మిన్ స‌మృద్ధిగా ల‌భిస్తుంది. దీంతో ఎముక‌లు ఆరోగ్యంగా ఉండ‌డ‌మే కాదు, శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి సైతం పెరుగుతుంది.

ఎముక‌ల దృఢ‌త్వానికి..

పాల‌లో ఉండే ఫాస్ఫ‌ర‌స్ ఎముక‌లు బ‌లంగా మారేందుకు ఎంత‌గానో స‌హాయ ప‌డుతుంది. కొవ్వు తీసిన పాల‌ను సేవించ‌డం వ‌ల్ల గుండె పోటు, టైప్ 2 డ‌యాబెటిస్ వ‌చ్చే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా ఉంటాయ‌ని సైంటిస్టుల ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది. అలాగే పాల‌ను తాగితే హైబీపీ కంట్రోల్ అవుతుంది. ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. కండ‌రాల పెరుగుద‌ల‌కు అవ‌స‌రం అయ్యే అనేక పోష‌కాలు పాల‌లో ఉంటాయి. పాల‌లో ఉండే ప్రోటీన్లు కండ‌రాల‌ను నిర్మించేందుకు, కండ‌రాల మ‌ర‌మ్మ‌త్తుల‌కు స‌హాయ ప‌డ‌తాయి. వ్యాయామం చేసిన త‌రువాత పాల‌ను తాగితే కోల్పోయిన శ‌క్తిని తిరిగి పొంద‌వ‌చ్చు. అలాగే కండ‌రాలు నిర్మాణ‌మ‌వుతాయి.

గుండె ఆరోగ్యానికి..

పాల‌లో ఉండే పొటాషియం శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రాను మెరుగు ప‌రుస్తుంది. దీంతో హైబీపీ త‌గ్గుతుంది. అలాగే కండ‌రాల క‌ద‌లిక‌లు స‌రిగ్గా ఉండేలా చేస్తుంది. దీంతో రాత్రి పూట పిక్క‌లు ప‌ట్టుకుపోవ‌డం వంటి స‌మ‌స్య‌లు ఉండ‌వు. అలాగే నాడీ మండ‌ల వ్య‌వ‌స్థ కూడా చురుగ్గా ప‌నిచేస్తుంది. పాల‌లో విట‌మిన్ ఎ స‌మృద్ధిగా ఉంటుంది. ఇది కండ‌రాల‌ను నిర్మాణం చేయ‌డంతోపాటు కండ‌రాల దృఢ‌త్వానికి ప‌నిచేస్తుంది. అలాగే రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. సీజ‌న‌ల్ వ్యాధుల నుంచి ర‌క్ష‌ణ‌ను అందిస్తుంది. కంటి చూపును మెరుగు ప‌రుస్తుంది. పాల‌లో ఉండే రైబోఫ్లేవిన్ చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. చ‌ర్మం ప‌గ‌ల‌కుండా చూస్తుంది. ఇలా పాల‌ను తాగ‌డం వ‌ల్ల అనేక అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అయితే పాల‌ను ఏ స‌మ‌యంలో తాగాలి అని చాలా మంది సందేహిస్తుంటారు. అందుకు నిపుణులు ఏమ‌ని స‌మాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

ఏ స‌మ‌యంలో తాగాలి..

పాల‌ను ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ అనంత‌రం తాగ‌వ‌చ్చు. లేదా రాత్రి నిద్ర‌కు ముందు తాగ‌వ‌చ్చు. నిద్ర‌లేమి సమ‌స్య ఉన్న‌వారు రాత్రి నిద్ర‌కు ముందు పాల‌ను తాగాలి. ఇక మిగిలిన ఎవ‌రైనా స‌రే ఉద‌యం తాగితే మంచిది. దీంతో శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు ఉద‌య‌మే లభిస్తాయి. ఉద‌యం వ్యాయామం చేసిన అనంత‌రం పాల‌ను తాగ‌వ‌చ్చు. లేదా బ్రేక్‌ఫాస్ట్ చేసిన అనంత‌రం పాల‌ను తాగ‌వ‌చ్చు. ఇలా పాల‌ను తాగితే అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ముఖ్యంగా పాల‌లో ఉండే పోష‌కాల‌న్నింటినీ పొంద‌వ‌చ్చు. దీంతో శ‌రీరం ఆరోగ్యంగా ఉంటుంది. రోగాల నుంచి ర‌క్ష‌ణ లభిస్తుంది. ఇమ్యూనిటీ పెరిగి అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు. కాబ‌ట్టి రోజూ పాల‌ను తాగితే ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చ‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు.

 

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి