లక్ష డప్పులు వేయి గొంతులు సభను విజయవంతం చేయాలి --- ఆర్కేపీ ఎంఆర్పిఎస్ ప్రకటన
జర్నలిస్టు ప్రెస్ అండ్ మీడియా న్యూస్,జనవరి 29, రామకృష్ణాపూర్ న్యూస్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో వచ్చే నెల 7న ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే లక్ష డప్పులు అనే బహిరంగ సభకు దళిత ప్రజానీకం అందరు కూడా అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ ఎమ్మార్పీఎస్ నాయకులు కోరారు.ఈ క్రమంలో చూస్తే..రామకృష్ణాపూర్ లోని తిలక్ నగర్ లో బుధవారం నిర్వహించిన ఎమ్మార్పీఎస్ ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశంలో చర్చించారు.ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు సరేష్ మాట్లాడారు. ఏబిసిడి వర్గీకరణలో భాగంగానే రాజధానిలో నిర్వహించే బహిరంగ సభకు పట్టణంలోని అన్ని దళిత వర్గ ప్రజానీకం అధిక సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు.ముఖ్యంగా ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ నేతృత్వంలో ఆ సభ భారీ ఎత్తున చేపడుతున్నట్లు పేర్కొన్నారు.ఈ నేపథ్యంలోనే దళితనులందరూ కూడా డప్పులు చేత పట్టుకొని ఆ సభకు అత్యంత ఉత్సాహంతో తరలిరావాలని దానికి పట్టణ ఎమ్మార్పీఎస్ విజ్ఞప్తి చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు సరేష్,ఆరు ముళ్ళ పోచం,కళ్యాణ్,కలువల శ్రీనివాస్,రాజయ్య,చందర్,శంకర్,మాదిగ సోదరీ,సోదరులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment