క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ మహాత్మునికి నివాళులు
---ఎమ్మెల్యే వివేక్ తో కలిసి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసిన జర్నలిస్టులు
జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్ జనవరి 30 రామకృష్ణ పూర్ న్యూస్ : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల సింగరేణి ఠాగూర్ స్టేడియం ముందు గల మహాత్మా గాంధీ విగ్రహానికి క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేశారు.ఈ సందర్భంగా చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి తో కలిసి గురువారం చేపట్టిన సంబంధిత కార్యక్రమంలో క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కలువల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ కమిటీ ట్రెజరర్ పరికిపండ్ల రాజు వైస్ ప్రెసిడెంట్ తూముల భవిష్యత్ లు మహాత్మ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ అండ్ మీడియా జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment