గంజాయి రవాణాలో ప్రెస్ స్టిక్కర్ పేరుతో ఇద్దరు జర్నలిస్టులు
గంజాయి రవాణాలో ప్రెస్ స్టిక్కర్ పేరుతో ఇద్దరు జర్నలిస్టులు
జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్ జనవరి 31 భద్రాచలం న్యూస్ : గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు జర్నలిస్టులు సహా ముగ్గురు వ్యక్తులను నార్కోటిక్ విభాగపు పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు.ఆ క్రమంలో చూస్తే...భద్రాచలం పట్టణంలోని గోదావరి నది బ్రిడ్జి చెక్ పోస్టు వద్ద నార్కోటిక్ పోలీసులకు చిక్కిన ఆ ఇద్దరు విలేకరుల గంజాయి దందా ఘటన కలకలానికి దారి తీసింది.ఆ నేపథ్యంలోనే నార్కోటిక్ అధికారులు భద్రాచలం బ్రడ్జి వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా ఆ ఇద్దరు విలేకరులు ‘ప్రెస్’ స్టిక్కర్ గల కారులో గంజాయిని రవాణా చేస్తూ పట్టుబడ్డారు.ఆ ఇద్దరు కూడా బూర్గంపాడు మండలంలో విలేకరులుగా చెలామణిలో ఉన్నారు.ఆ ఇద్దరు విలేకరుల్లో ఒకరు ప్రెస్ క్లబ్ లో కీలక బాధ్యతల్లో ఉన్నట్లు సమాచారం.ఆ నిందితుల నుంచి రూ. 20.25 లక్షల విలువైన 81.950 కిలోల ఎండు గంజాయిని నార్కొటిక్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.వారితోకలిసి గంజాయి రవాణా చేస్తున్న ఛత్తీస్ గఢ్ లోని కుంట తాలూకా మర్లగూడకు చెందిన మరో వ్యక్తిని కూడా నార్కోటిక్ పోలీసులు అదుపులోకి తీసుకుని భద్రాచలం టౌన్ పోలీసులకు అప్పగించారు. అయితే పోలీసులు పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
Comments
Post a Comment