11 రోజులు భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ రైలు రద్దు?
11 రోజులు భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ రైలు రద్దు?
-- జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్...
మంచిర్యాల న్యూస్ ఫిబ్రవరి 9 జర్నలిస్టు తెలుగు దినపత్రిక :ఉత్తర తెలంగాణ వాసుల వరప్రదాయని,భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ రైలు 11 రోజులపాటు నిలిచిపోనుంది.ఆ క్రమంలో చూస్తే..ఖమ్మం జిల్లాలో నూతనంగా ఆ రైల్వే లైన్ మరమ్మత్తు పనులు సాగుతున్నాయి.ఆ నేపథ్యంలోనే ఫిబ్రవరి 10 నుంచి 21 తేదీ వరకు సంబంధిత ఆ భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ రైలు రాకపోకలను నిలిపివేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.ఆ తరుణంలో సిర్పూర్ కాగజ్నగర్ - సికింద్రాబాద్ మార్గంలో నడిచే భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ తో పాటు ఇంకా ప్యాసింజర్ రైళ్లను సైతం తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కమర్షియల్ చీప్ అధికారి కైలాస్ ప్రకటనలో వెల్లడించారు.అదేవిధంగా భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ - సికింద్రాబాద్ రూట్లో గుంటూరు వరకు నడిచే గోల్కొండ ఎక్స్ప్రెస్ రైల్ లింకుతో భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ రైలు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.ముఖ్యంగా ప్రతి నిత్యం సికింద్రాబాద్ నుంచి బయలుదేరి కాజీపేట,ఉప్పల్ జమ్మికుంట,పోత్కపల్లి,పెద్దపల్లి,రామగుండం,మంచిర్యాల,కాగజ్ నగర్ వరకు ఆ ట్రైన్ లో వివిధ ఉద్యోగస్తులు,విద్యార్థులు,వ్యాపారస్తులు అధిక సంఖ్యలో ప్రయాణిస్తారు.ఆ సమయంలో ఇకనుంచి పైన పేర్కొన్న తేదీ వరకు వాళ్లకు కష్టాలు తప్పవని చెప్పడంలో అసలు సందేహం లేదు.
Comments
Post a Comment