మార్కెట్లోకి కొత్త ₹50 రూపాయల నోటు !!

మార్కెట్లోకి  కొత్త ₹50 రూపాయల నోటు!


--   జర్నలిస్టు తెలుగు దిన పత్రిక అండ్ మీడియా న్యూస్...

హైదరాబాదు,ఫిబ్రవరి13 : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  కీలక ప్రకటన విడుదల చేసింది.ఆ క్రమంలో చూస్తే...ఆర్బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకముతో కూడిన కొత్త ₹50 నోటును అతి త్వరలోనే విడుదల చేయనున్నట్లు ఆర్బిఐ బుధవారం సాయంత్రం వెల్లడించింది.ఇటీవలనే సంజయ్ మల్హోత్రా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.గతేడాది డిసెంబర్ లోనే ఆయన గవర్నర్ బాధ్యతలను చేపట్టారు. ఆ నేపథ్యంలోనే మహాత్మా గాంధీ సిరీస్ లో కొత్త రూ.50 నోటును మార్కెట్లోకి విడుదల చేయనున్నట్టు ఆర్బిఐ ప్రకటించింది.ఇప్పుడున్న నోట్లపై మాజీ గవర్నర్ సంతకం ముద్రించి ఉంది.ఆ కొత్త నోట్లపై ప్రస్తుతం గవర్నర్ సంతకంతో వీటిని విడుదల చేసేందుకు సిద్ధమైంది.కొత్తగా ప్రింట్ చేయనున్న రూ.50 నోటు మహాత్మా గాంధీ సిరీస్ లో భాగంగానే డిజైన్ ఉండనుందని ఆర్బీఐ ఆరోజు ప్రకటనలో తెలిపింది.అదేవిధంగా పాత నోట్ల విషయంలోనూ కీలక ప్రకటన చేసింది.ముఖ్యంగా కొత్త నోట్లు రానున్న వేళ పాత 50 రూపాయల నోటును వెనక్కి తీసుకుంటారా? అనే విషయంపైనా స్పష్టత ఇచ్చింది.ఆ పాత నోట్ల విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరంలేదని తెలిపింది.అయితే కొత్త నోట్లు విడుదల చేసినప్పటకీ ప్రస్తుతం ఉన్న నోట్లు కూడా మార్కెట్లో చెలామణీలోనే ఉంటాయని ఆర్బీఐ అధికారులు స్పష్టం చేశారు.కాగా సోషల్ మీడియాలో వచ్చే పుకార్ల కు చెక్ పెట్టేలా ఆర్బీఐ పూర్తి క్లారిటీ ఇచ్చింది.కొత్త నోటు ఎలా ఉంటుందంటే?ఆర్బీఐ అందించిన సమాచారం ప్రకారం కొత్త యాబై రూపాయల నోటు మహాత్మాగాంధీ (కొత్త) సిరీస్ లోనే విడుదల చేయనున్నారు.దానిని ఫ్లోర్ సెంట్ నీలం రంగులో డిజైన్ చేయనున్నట్టు తెలుస్తోంది.ఆ నోటు వెనుక భాగంలో రథంతో ఉన్న హంపి చిత్రంతో దేశ సాంస్కతిక వారసత్వా న్ని ప్రతిబింబించేలా ఉంటుంది.ఈ నోటు పరిమాణం 66 మి.మీ x 135 మి.మీ ఉంటుందని తెలిసింది.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి