తవక్కల్ హై స్కూల్ చైర్మన్ అజిజ్ 57వ జన్మదినంతో రక్తదానం

---  తవక్కల్ హై స్కూల్ చైర్మన్ అజిజ్ 57వ జన్మదినంతో రక్తదానం

---  జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్...











---  తవక్కల్ స్కూల్ గ్రౌండ్ లో రక్తదానం చేసిన దాతలు 

---   తవక్కల్ స్కూల్ చైర్మన్ అజిజ్,కాంగ్రెస్ నాయకులు పల్లెరాజు,రఘునాథ్ రెడ్డి,గాండ్ల సమ్మయ్య ప్రసంగం 

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల తవక్కల్ ఉన్నత పాఠశాలలో గురువారం రక్తదాన శిబిరం నిర్వహించారు.ఆ క్రమంలో చూస్తే..తవక్కల్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ ఎండి.అబ్దుల్ అజీజ్ 57వ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం ప్రోగ్రాం నిర్వహించారు.ఆ పాఠశాల గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన కార్యక్రమంలో రక్తదాతలు అక్కడికి చేరుకొని వాళ్ల యొక్క అమూల్యమైన రక్తంను దానం చేశారు.ఈ సందర్భంగా తవక్కల్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్,కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎండి.అబ్దుల్ అజీజ్,కాంగ్రెస్ పార్టీ రామకృష్ణాపూర్ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు,పిసిసి సెక్రెటరీ పి.రఘునాథరెడ్డి, సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్యలు మాట్లాడారు.అబ్దుల్ అజీజ్ బర్త్ డే సందర్భంగా రక్తదానం చేసిన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నీలం శ్రీనివాస్ గౌడ్,గోపు రాజం,మాజీ కౌన్సిలర్ల భర్తలు ఎర్రబెల్లి రాజేష్,బింగి శివ కిరణ్,యమహా శ్రీనివాస్,ట్రస్మ నాయకులు,మైనారిటీ నాయకులు పాషా,పార్టీ నాయకులు సత్యపాల్,తల సేమియా సికిల్ సెల్ అసోసియేషన్ నాయకులు కాసర్ల శ్రీనివాస్,కాసర్ల రంజిత్,మంచిర్యాల రెడ్ క్రాస్ సొసైటీ సిబ్బంది,కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు,స్థానికులు,పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది,విద్యార్థుల తల్లిదండ్రులు,తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి