79 ఏళ్ల వయసులో ఎంబీఏ చేస్తున్న ఉషా రే
79 ఏళ్ల వయసులో కూడా ఎంబీఏ చేస్తున్న ఉషా రే
-- జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్...
యూపీలోని లక్నోకు చెందిన ఉషా రే రెండుసార్లు క్యాన్సర్ వ్యాధిని జయించింది.అంతేకాకుండా 79 ఏళ్ల వయసులో కూడా ఇంకా ఆమె ఎంబీఏ చదువుతున్నారు.ఆ క్రమంలో చూస్తే..మనిషి జీవితంలో ఏది సాధించాలన్నా వయసు అసలు అడ్డు కాదని నిరూపిస్తుందని చెప్పడంలో అసలు సందేహం లేదు.ఆ నేపథ్యంలోనే నేటి యువతకు ఆమె గొప్పగా ఆదర్శంగా నిలిచారు.ముఖ్యంగా రిటైర్మెంట్ తర్వాత విశ్రాంతి తీసుకోకుండా ఆమె పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు.కాగా ప్రధానంగా మెదడుకు పని చెప్పడం,సమయాన్ని వృధా చేయకుండా ఉండటం కోసం ఆమె ఎలాగైనా సరే ఈసారి ఎంబిఏ చదవాలని పట్టుదలతో నిర్ణయించుకుంది.
Comments
Post a Comment