ఆర్కేపి కాంగ్రెస్ ఆఫీసులో ఎంపీ వంశీకృష్ణ జన్మదిన వేడుకలు
ఆర్కేపి కాంగ్రెస్ ఆఫీసులో ఎంపీ వంశీకృష్ణ జన్మదిన వేడుకలు
-- కేక్ కట్ చేసి పార్టీ శ్రేణుల సంబురాలు
రామకృష్ణాపూర్ న్యూస్ ఫిబ్రవరి 10 జర్నలిస్టు తెలుగు దినపత్రిక : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు ఆధ్వర్యంలో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ 36వ జన్మదిన వేడుకలను సోమవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు.ఆ సందర్భంగా పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకున్నారు.ఆ సందర్భంగా పల్లె రాజు మాట్లాడుతూ..పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వాళ్ల యొక్క తాత వెంకటస్వామి,తండ్రి వివేక్ అడుగుజాడల్లో నడుస్తూ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి కేంద్ర ప్రభుత్వ పథకాలైన అమృత్ 2.0 తాగు నీటి పథకం,ప్రయాణికుల సౌకర్యార్థం వందే భారత్ ఎక్స్ ప్రెస్ హల్టింగ్ కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి గత పది సంవత్సరాలలో పెండింగ్ ఉన్న పనులకు క్లియరెన్స్ చేయించి అభివృద్ధికి బాటలు వేస్తున్నరని తెలిపారు.అనంతరం టీపీసీసీ కార్యదర్శి పిన్నింటి రఘనాథ్ రెడ్డి మాట్లాడుతూ..ఎంపీ విశాఖ ట్రస్ట్ ద్వారా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో అనేక సామజిక సేవ కార్యక్రమాలను ఉచితంగా చేయిస్తూ సమాజ శ్రేయస్సుకు కృషి చేస్తున్నారని గుర్తు చేశారు.అలాగే యువ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ,ఆర్ధికంగా సహాయం చేస్తూ వాళ్ల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారని వివరించారు.ఎంపీగా పార్లమెంట్ కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని పార్లమెంట్ సాక్షిగా నిలదీస్తున్నారని తెలిపారు.అనంతరం కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకున్నారు.ఆ కార్యక్రమం లో మాజీ క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్ పర్సన్ జంగం కళ,నాయకులు గోపు రాజం,గోపతి బానేశ్,పలిగిరి కనకరాజు, lమారపల్లి రాజయ్య,అఫ్జల్ లాడెన్,సంగ రవి,బత్తుల వేణు,అమృత కుమారస్వామి,కట్లా రమేష్,రామస్వామి,అక్కల లచ్చయ్య,కుర్మా మహేందర్,బోద్దుల ప్రేమ్ సాగర్,మిసా కుమార్,వెంకట్ రెడ్డి,మల్లేష్,నగేష్,మహిళ నాయకురాలు సునీత,శారద,పుష్ప,సృజన తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment