లక్ష డప్పులు వేల గొంతులు ఎమ్మార్పీఎస్ సభకు డప్పులు డొనేట్ చేసిన నక్షత్ర ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్

లక్ష డప్పులు వేల గొంతులు ఎమ్మార్పీఎస్ సభకు డప్పులు డొనేట్ చేసిన నక్షత్ర ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ 

--  చైర్మన్ రాజుకు కృతజ్ఞతలు తెలిపిన క్యాతనపల్లి ఎంఆర్పిఎస్ 

--  జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్...

మంచిర్యాల న్యూస్ ఫిబ్రవరి 4 : మంచిర్యాల పట్టణంలోని నక్షత్ర ఇన్ఫ్రా ప్రైవేట్ కంపెనీ అనే రియల్ ఎస్టేట్ సంస్థ చైర్మన్ రాజు క్యాతనపల్లి ఎమ్మార్పీఎస్ కమిటీ సభ్యులకు మాదిగ దండోరా డప్పులు డొనేట్ గా ప్రధానం చేసారు.ఆ క్రమంలో చూస్తే..ఈ నెల 7న హైదరాబాదులో జరిగే ఎమ్మార్పీఎస్ భారీ ఎత్తున బహిరంగ సభకు తరలి వెళ్తున్న స్థానిక మాదిగ సోదరులకు ఆ డప్పులు అవసరం ఉన్న దృష్ట్యా ఆయన వెంటనే వాళ్ల విషయమై మంచిగా స్పందించారు.దాంతో నూతన డప్పు కొనుగోలు చేసి మంగళవారం నాడు క్యాతనపల్లి - రామకృష్ణాపూర్ ఎంఆర్పిఎస్ నాయకులకు ఆయన ఉచితంగా డొనేట్ చేశారు.ఆ నేపద్యంలో  నక్షత్ర ఇన్ఫ్రా ఎస్టేట్స్ చైర్మన్ రాజుకు సంతోషంగా  క్యాతనపల్లి ఎంఆర్పిఎస్ నాయకులు కృతజ్ఞతలు-




ధన్యవాదాలు తెలిపారు.ఆ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు సరేష్,భద్రయ్య,జర్నలిస్టు తెలుగు దినపత్రిక ప్రెస్ అండ్ మీడియా ఎడిటర్ కలువల శ్రీనివాస్,కిరణ్,సంపత్,నక్షత్ర రియల్ ఎస్టేట్ ఉద్యోగ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి