గాంధారి ఖిల్లా మైసమ్మ జాతర భీమన్న ఆలయం వద్ద భక్తి శ్రద్ధలతో ప్రారంభం
గాంధారి ఖిల్లా మైసమ్మ జాతర భక్తిశ్రద్ధలతో భీమన్న ఆలయం వద్ద ప్రారంభం..
- మొదటి రోజు భీమన్న గాజులు తీసుకొని పాదయాత్రగా మంచిర్యాల గోదావరికి బయలుదేరారు
-- మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ పర్యవేక్షణ-ప్రసంగం
- జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్....
రామకృష్ణాపూర్ న్యూస్ ఫిబ్రవరి 14 జర్నలిస్టు తెలుగు దినపత్రిక : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల బొక్కల గుట్టలోని గాంధారి ఖిల్లా మూడు రోజుల మైసమ్మ మహా జాతరలో భాగంగా మొదటి రోజు శుక్రవారం ఆదివాసి నాయక్ పొడ్ గిరిజనులు వాళ్ల యొక్క సంస్కృతితో సదర్ల భీమన్న ఆలయం వద్ద పూజారులచే భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.అనంతరం భీమన్న గాజులు తీసుకొని పాదయాత్రగా తప్పిడి గోలు పిల్లనగ్రోవితో నృత్యాలు చేసుకుంటూ మంచిర్యాలలోని గోదావరి నది తీరానికి బయలుదేరారు.దాంతో గోదావరిలో భీమన్న గాజాలను పవిత్ర గోదావరి జలాలతో పూజలు చేసారు.అనంతరం అక్కడి పవిత్ర గోదావరి జలాలను తీసుకొని సాయంత్రం జాతరకు చేరుకొని రాత్రంతా కూడా భీమన్న గజాల వద్ద పూజలు చేస్తారు.అలాగే రెండవ రోజు శనివారం ఉదయం నాలుగు గంటల నుంచి 5 గంటల వరకు భీమన్న గజాల వద్ద పట్నాలు వేస్తారు.ఆ నేపథ్యంలోనే బొక్కల గుట్ట వద్ద ఊరి పోచమ్మ - గాంధారి మైసమ్మ వద్ద కూడా పూజలు చేసి బలుల అర్పిస్తారు.దాంతో 101 ఆదివాసి మహిళలు అక్కడికి చేరుకొని 101 జలకుండలతో అక్కడి గుట్ట పైకి వెళ్లి మైసమ్మ తల్లి దేవతలను శుద్ధి చేస్తారు.ఆ సమయంలో సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమలు నిర్వహిస్తారు.అటుపిమ్మట మూడవరోజు మైసమ్మ తల్లికి పెద్ద పూజ (పట్నాలు) తెల్లవారుజామున 12 గంటల నుంచి 5 గంటలలోపు ఆదివాసి నాయక్ పోడు సంఘం ఆధ్వర్యంలో పూజలు చేయడం జరుగుతుంది.అనంతరం మూడవరోజు చివరి దినం ఏడు గంటల నుంచి మైసమ్మ తల్లిని దర్శించుకోవడానికి అక్కడ జాతరకు వచ్చే అన్ని వర్గాల ప్రజలకు భక్తులకు అనుమతి ఇస్తారు.అదే రోజు చివరిదినం ఉదయం 11 గంటలకు ఆదివాసి నాయకపోడు సంఘం ప్రజలు అక్కడి జాతరలో ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు పరిష్కారం కోసం ప్రజా దర్బార్ నిర్వహిస్తారు.ఆ మొదటి రోజు జాతరలో మంచిర్యాల కలెక్టర్ దీపక్ కుమార్ గాంధారి ఖిల్లా మైసమ్మ జాతరకు చేరుకొని అక్కడి పరిస్థితులను జాతర విశేషాలను ఇంకా సౌకర్యాలను అన్నీ కూడా అడిగి వివరాలు తెలుసుకొని పరిశీలించారు.అనంతరం సదర్ల భీమన్న అలాగే మైసమ్మ తల్లికి జిల్లా కలెక్టర్ పూజలు చేశారు.ఆ సందర్భంగా మంచిర్యాల కలెక్టర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.అలాగే ఆదివాసి నాయక్ పోడ్ సంఘం కమిటీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు పి.భార్గవ్ తో పాటు ఆ సంఘం నాయకులు కూడా గాంధారి ఖిల్లా మైసమ్మ జాతరకు సంబంధించిన వివరాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో క్యాతనపల్లి మున్సిపాలిటీ కమిషనర్ జి.రాజు,రామకృష్ణాపూర్ ఎస్సై జి.రాజశేఖర్,మందమర్రి తహసిల్దార్,రెండవ అదనపు ఎస్ఐ,ఆదివాసీ నాయక్ పోడు సేవా సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు పెద్ది భార్గవ్,ప్రధాన కార్యదర్శి డి.లక్ష్మణ్,గౌరవ అధ్యక్షులు ఎల్.రాజ్ కుమార్,ఆలయ కమిటీ చైర్మన్ రోడ్డు రమేష్,రాష్ట్ర సాంస్కృతిక కార్యదర్శి మేసినేని రాజన్న,ఆదివాసి హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు గంజి రాజన్న,ఆదివాసి నాయకపోడు సంఘం సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment