రహదారి మధ్యలో ఖచ్చితంగా కొత్త తిమ్మాపూర్ కు యూటర్న్ ఇవ్వాలి

రహదారి మధ్యలో తప్పకుండా కొత్త తిమ్మాపూర్ కు యూటర్న్ ఇవ్వాలి

--  గ్రామస్తులు యువకులు పనులను అడ్డుకున్న వైనం ఇది 

--  జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్... 

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని క్యాతనపల్లి మునిసిపాలిటీ పరిధిలో గల రహదారి విస్తరణ పనులలో భాగంగా రహదారి మధ్యలో డివైడర్లు నిర్మిస్తున్నా సంగతి తెలిసిందే.ఆ క్రమంలో చూస్తే..క్రొత్త తిమ్మాపూర్ గ్రామానికి వెళ్లే దారి వద్ద యూటర్న్ ఇవ్వకుండా డివైడర్ నిర్మించడంతో ఆ గ్రామస్తులు అక్కడి రోడ్డు పనులను శనివారం ఈరోజు అడ్డుకున్నారు.ఆ సందర్భంగా యువకులు మాట్లాడుతూ..గత కొద్ది రోజుల క్రితం గ్రామ నాయకులు చెన్నూరు శాసనసభ్యుడు జి వివేక్ ను కలిసి కలిసి వినతి పత్రం సమర్పించినట్టు తెలిపారు.ఆ విషయంపై కూడా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.అక్కడి ప్రాంతంలో యుటర్న్ ఇచ్చే విధంగా చూస్తామన్నారు.కానీ అధికారులు సూచన మేరకు సిబ్బంది డివైడర్ను నిర్మించే ప్రయత్నం చేశారు.దాంతో గ్రామస్తులు, గ్రామ యువకులు అక్కడి పనులను అడ్డుకున్నారు.కాగా 70 సంవత్సరాలుగా చరిత్ర కలిగినటువంటి ఊరికి వెళ్లడానికి యూటర్న్ ఇవ్వడంలో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.అంతేకాకుండా చెన్నూరు నియోజకవర్గంలో క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో కొత్త తిమ్మాపూర్ మొదటి పోలింగ్ బూతుగా నిర్వహించబడుతుందని గుర్తు చేశారు.ఆ గ్రామంలో వందలాది కుటుంబాలు ఎప్పటినుంచో నివసిస్తున్నట్లు పేర్కొన్నారు.ఇకనైనా ఆ గ్రామాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామానికి వెళ్లే దారిలో యూటర్న్ ఇవ్వాలని సంబంధిత అధికారులను,ప్రజాప్రతినిధులకు నమస్కారాలు తెలుపుతూ కోరారు.





Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి