ఢిల్లీ సిఎంగా రేఖా గుప్తా
ఢిల్లీ సిఎంగా రేఖా గుప్తా
-- జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్....
ఢిల్లీ సీఎం ఎవరనే ఉత్కంఠకు తెరపడింది.కొద్దిసేపటిక్రితం సమావేశమైన బీజేపీ శాసనసభ పక్షం సీఎం అభ్యర్థిని ఎన్నుకుంది.షాలిమర్ బాగ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన రేఖా గుప్తాను బీజేపీ ఎమ్మెల్యేలు సీఎంగా ఎన్నుకున్నారు.రేపు రామ్‌లీలా మైదానంలో జరిగే కార్యక్రమంలో ఆమె ఢిల్లీ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారు.ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ,కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరవుతారు.ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు.ఢిల్లీ సీఎం ఎంపిక కోసం కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్, బీజేపీ జాతీయ కార్యదర్శి ఓపీ దన్కర్‌ను బీజేపీ అధిష్టానం నియమించింది.ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశమైన ఈ ఇద్దరు పరిశీలకులు శాసనసభ్యుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అదే సమయంలో అధిష్టానం నిర్ణయాన్ని సభ్యుల ముందుంచారు.
చివరిగా ఏకగ్రీవంగా రేఖా గుప్తా పేరును ఢిల్లీ సీఎంగా ఎన్నుకున్నారు.
Comments
Post a Comment