రవీంద్రఖని రైల్వే స్టేషన్ ఏరియాలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

రవీంద్రఖని రైల్వే స్టేషన్ ఏరియాలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

-  ఆర్కేపి ఎస్ఐ జి.రాజశేఖర్

-  జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్...

రామకృష్ణాపూర్ న్యూస్ ఫిబ్రవరి 28 జర్నలిస్టు తెలుగు దినపత్రిక : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల రవీంద్ర ఖని రైల్వే స్టేషన్ ఏరియాలో శుక్రవారం పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్  ప్రోగ్రాం ఎట్టకేలకు నిర్వహించారు.ఆ క్రమంలో చూస్తే..రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాలు మేరకు  రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకతీయ కాలనీ ఇంకా గాంధీనగర్ ఏరియాలో ఈరోజు మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి ఆదేశాలు మేరకు పట్టణానికి చెందిన పోలీసు సిబ్బందితో కలిసి సంబంధిత కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు.దాంతో వాహన పత్రాలు సరిగా లేని 36 బైక్ లను,సరైన పత్రాలు లేని వాహనాలకు జరిమానా విధించారు.అలాగే 4 నాలుగు మోటర్ సైకిల్లను సీజ్ చేసారు.ఆ సందర్భంగా ఆర్కేపి ఎస్ఐ జి.రాజశేఖర్ మాట్లాడుతూ..






నేరాల నిర్మూలన కోసమే ఆ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.కాగా ప్రజల రక్షణ,భద్రత పోలీస్ బాధ్యతన్నారు.పట్టణంలో కొత్త వ్యక్తులు,నేరస్తులు,షెల్టర్ తీసుకుని ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.అదేవిధంగా ఎవరైనా కొత్త వారు అద్దెకు వస్తే వారికి సంబందించిన పూర్తి సమాచారం తీసుకోవాలన్నారు.చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకూడదని,యువత చెడు అలవాట్లకు బానిసగా మారి వాళ్ళయొక్క జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు.ఇంకా ఏవైనా సమస్యలున్నా పోలీసుల దృష్టికి తీసుకురావాలని లేదా మరేదైనా సమస్యలుంటే 100 నంబర్ కు కాల్ చేయాలని తెలిపారు.సబ్సైబర్ నేరాలు,మోసగాళ్ల ఫోన్ కాల్స్,మెసెజ్ లకు, వాట్సాప్ కాల్స్ కు స్పందించవద్దని సూచించారు.ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని,చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు.యువత మత్తుపదార్థాలైన గంజాయి సేవించడం వల్ల జీవితం నిర్వీర్యం అవుతుందని, ఎవరైనా గంజాయి రవాణా చేసిన పోలీసు వారి దృష్టికి తేవాలని సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ప్రకటించారు.ఆ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి