ఆర్కేపిలోని తవక్కల్ పాఠశాలలో ఘనంగా వసంత పంచమి వేడుకలు...
ఆర్కేపిలోని తవక్కల్ పాఠశాలలో ఘనంగా వసంత పంచమి వేడుకలు...
-- జర్నలిస్టు తెలుగు దినపత్రిక ప్రెస్ అండ్ మీడియా న్యూస్...
రామకృష్ణాపూర్ న్యూస్ ఫిబ్రవరి 3 : వసంత పంచమి సందర్భంగా సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపుర్ లో గల తవక్కల్ పాఠశాలలో వసంత పంచమి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు.ఆ క్రమంలో చూస్తే..పాఠశాలలోని విద్యార్థులు,ఉపాధ్యాయలు ఇంకా తల్లిదండ్రులు వేదపండితుల సమక్షంలో ఈరోజు సరస్వతి దేవి పూజను వైభవంగా భక్తిశ్రద్ధలతో చేపట్టడం కనిపించింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తవక్కల్ విద్యా సంస్థల చైర్మన్ అబ్దుల్ అజీజ్ హాజరైనారు.దాంతో పాఠశాలలో చదవుతున్న పదవ తరగతి విద్యార్థులతో ఆయన పూజలు జరిపారు.అంతేకాకుండా నూతనంగా పాఠశాలలో చేరే విద్యార్థులకు స్వయంగా అక్షరాభ్యాసం చేయించారు.
Comments
Post a Comment